జనసేన అధినేతపవన్ కల్యామ్ చాలా రోజుల తర్వాత పార్టీపై దృష్టి పెట్టారు. మంగళ, బుధవారాల్లో రెండురోజుల పాటు.. కీలక సమావేశాలను మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో పార్టీ నేతలతో భేటీ మాత్రమే కాదు.. రాజధాని రైతులతో కూడా.. పవన్ కల్యాణ్ ముఖాముఖి ఉంటుందని జనసేన ప్రకటించింది. సిక్కోలు నుంచి అనంతపురం జిల్లా వరకు ఉండే ఐదు నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతారు. పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. మధ్యాహ్నాం కోస్తా జిల్లాల నేతలతో భేటీ అవుతారు. పదిహేడో తేదీ భేటీలు అలా ముగుస్తాయి. పద్దెమి అమరావతికి భూములిచ్చిన కొందరు మహిళా రైతులతో ముఖాముఖి బేటీ నిర్వహించారు.
దాదాపు 8 నెలల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ ఆ పార్టీ నాయకులతో నేరుగా భేటీ కాబోతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. పార్టీ కార్యక్రమాలు దాదాపుగా లేవు. బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ బలోపేతం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత మాత్రం..మోడీని పొడుగుతూ.. బీజేపీని అభినందిస్తూ టైం పాస్ చేస్తున్నారు. దీంతో క్యాడర్లో నిస్తైజం అవరించింది. కీలకమైన అంశాలపై జనసేన పోరాటం తేలిపోతోంది. అక్కడక్కడ ఉత్సాహం ఉన్న లీడర్లు పోరాటం చేస్తున్నప్పటికీ.. పార్టీ నిస్తేజంగా ఉండటంతో వారి పోరాటానికి ప్రాముఖ్యత లభించండం లేదు.
ఈ క్రమంలో హఠాత్తుగా పవన్ కల్యాణ్ రెండురోజుల పాటు… ఎంపిక చేసిన నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. పనిలో పనిగా రాజధాని మహిళా రైతులతోనూ సమావేశమవుతారు. గతంలో అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఈ సారి.. ఏ ప్రకటన చేస్తారోనని.. ఆసక్తి వ్యక్తమవుతోంది.