గ్రేటర్ పోటీ నుంచి జనసేన ఔట్..! బీజేపీకి ఔట్ రైట్ సపోర్ట్..!

గ్రేటర్ ఎన్నికల బరి నుంచి జనసేనను తప్పించేసింది భారతీయ జనతా పార్టీ. అభ్యర్థులను ప్రకటించి.. సోషల్ మీడియాలో మార్పు కోసం జనసేన అనే పేరుతో ప్రచారం కూడా ప్రారంభించిన జనసేన పార్టీ నేతలకు.., పవన్ కల్యాణ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కే లక్ష్మణ్ వచ్చి అడగగానే… బీజేపీకి మద్దతు ప్రకటించి తాను ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని.. క్యాడర్ నిబద్ధతతో ఉందని… పవన్ కల్యాణ్.. నోటిఫికేషన్ వచ్చిన రోజున ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్, జనసేన పార్టీ నేతలు.. పోటీ చేయడానికి.. ఉబలాటపడ్డారు. జనసేన పార్టీ నేతలు బీఫాంలు కూడా పంపిణీ చేశారు. ఈ మధ్యలో పొత్తుల గురించి చర్చ జరిగింది. కానీ.. తాము ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించేశారు. దాంతో ఇక పొత్తు లేదు.. ఎవరికి వారు పోటీ చేస్తారని అనుకున్నారు.

ఈ లోపు కిషన్ రెడ్డి సీన్ మార్చేశారు. నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపి.. భేటీ ఖరారు చేశారు. నాదెండ్ల మనోహర్ ఇంట్లోనే కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో.. పవన్ సమావేశమయ్యారు. చర్చల తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా పవన్ ప్రకటించారు. కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా తప్పుకుంటున్నామని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాలని.. ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని పిలుపునిచ్చారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తామన్నారు. సమయం లేకపోవడం.. కమ్యూనికేషన్‌ గ్యాప్‌తో పొత్తు పెట్టుకోలేకపోయామని.. బీజేపీతో కలిసి పనిచేయడంపై రోడ్ మ్యాప్‌ రూపొందిస్తామని పవన్ తెలిపారు.

కేవలం పోటీ నుంచి ఉపసంహరించుకోవడమే కాదు.. పవన్ కల్యాణ్.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం కూడా చేయబోతున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ ఎదురుగానే లక్ష్మణ్ ప్రకటించారు. పెద్ద మనసుతో ఒప్పుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కనీసం పదో.. ఇరవయ్యే సీట్లు తీసుకుని పొత్తు పెట్టుకుని ఉంటే కాస్త గౌరవంగా ఉండేదని.. ఇప్పుడు.. అసలు పోటీ నుంచి వైదొలగడం అంటే.. నామోషీనేనని జనసేన కార్యకర్తలు మథన పడుతున్నారు. పవన్ కల్యాణ్‌ రాజకీయ వ్యూహాలు.. పార్టీకి ఉపయోగపడేలా లేవని.. ఆయనకు సలహాలిస్తున్న వారు.. తప్పులు చేస్తున్నారని.. బాధపడుతున్నారు. కానీ.. వారి బాధను పట్టించుకునేవారు లేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫేక్ పోస్టులు , కేసుల చుట్టూ తెలంగాణ రాజకీయం !

సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్లుగాఫేక్ చేసుకుంట ఒకరిపై ఒకరు బురద చల్లుకోడానికి చేస్తున్న రాజకీయం తెలంగామణలో కేసులు, అరెస్టుల వరకూ వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వీడియోను ట్విస్ట్...

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close