సందీప్ కిషన్ తో లావణ్య త్రిపాఠి రొమాన్స్

అందాల రాక్షసి సినిమాతో అందం అభినయం కలగలిపిన రూపంగా లావణ్య త్రిపాఠి అదుర్స్ అనిపించింది. ఇక కెరియర్ మొదట్లో అవకాశాల కోసం కాస్త తడబడ్డా ఇప్పుడు వరుస ఛాన్స్ లు కొట్టేస్తుంది ఈ భామ. సంక్రాంతి రిలీజ్ సోగ్గాడితో హిట్ కొట్టిన లావణ్య త్రిపాఠి ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా నిరాశ పరచింది.. అయినా అవకాశాలను మాత్రం ఓ రేంజ్ లో అందుకుంటుంది.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో నటిస్తున్న లావణ్య మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. యువ హీరోల్లో మంచి స్పీడ్ మీదున్న హీరో సందీప్ కిషన్.. తెలుగు కుర్రాడే అయినా తెలుగు తమిళ భాషల్లో తన సినిమాలను రిలీజ్ చేయిస్తూ క్రేజ్ సంపాధించాడు. ప్రస్తుతం సందీప్ నటిస్తున్న ‘ఒక అమ్మాయి తప్ప’ దాదాపు పూర్తి కావొచ్చింది.

లాస్ట్ ఇయర్ ‘టైగర్’ అంటూ తనలో ఉన్న మాస్ యాంగిల్ ను బయటపెట్టిన సందీప్ ఈసారి పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. దర్శక నిర్మాత సి.వి.కుమార్ దర్శకత్వంలో ‘మాయావన్’ సినిమా చేస్తున్నాడు సందీప్.. ఇంకా తెలుగు టైటిల్ పెట్టని ఈ సినిమాలో లావణ్య కథానాయికగా సెలెక్ట్ అయ్యింది. ఇప్పటిదాకా తెలుగులో ఫుల్ ఫాంలో ఉన్న లావణ్య ఇక నుండి తమిళ్ లో కూడా బిజీ హీరోయిన్ అవ్వనుంది. మరి తెలుగులో లానే తమిళ ప్రేక్షకులను కూడా అమ్మడు తన బుట్టలో పడేస్తుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close