ఇళ‌య‌రాజాకు ఎందుకంత ప‌ట్టు?

సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాకీ చెన్నైలోని ప్ర‌సాద్ స్టూడియో యాజ‌మాన్యానికీ మ‌ధ్య వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. స్టూడియోలోని ఓ గ‌దిలో ఇళ‌య‌రాజా దాదాపు 40 ఏళ్ల నుంచీ త‌న ఆఫీసుగా చేసుకుని, అక్క‌డి నుంచే త‌న కార్య‌క‌పాలాల్ని నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఇటీవ‌ల ప్ర‌సాద్ యాజ‌మాన్యం ఇళ‌య‌రాజాతో ఆ గ‌ది ఖాళీ చేయించింది. దానికి ఆగ్ర‌హించిన ఇళ‌య‌రాజా.. ఆ గ‌దిపై త‌నకు హ‌క్కులున్నాయంటూ హైకోర్టుని ఆశ్ర‌యించారు. `ధ్యానం చేయడానికి గ‌దిలోకి వెళ్తే.. న‌న్ను అక్క‌డ ఉండ‌నివ్వ‌డం లేదు. న‌ల‌భై ఏళ్లుగా ఉన్న గ‌ది నుంచి బ‌ల‌వంతంగా గెంటేశారు. ఆఫీసులోని నా సంగీత ప‌రిక‌రాల్ని ధ్వంసం చేశార‌`ంటూ.. హైకోర్టు కు విన్న‌వించుకున్నారు. హైకోర్టు కూడా.. ఇళ‌య‌రాజా ప‌క్షాన్నే మాట్లాడింది. `ఆయ‌న్ని ఒక రోజు ధ్యానం చేసుకోవ‌డానికి ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌రు` అంటూ.. హైకోర్టు.. ప్ర‌సాద్ యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించింది. దీనిపై సోమ‌వారం ప్ర‌సాద్ స్టూడియో అధినేత‌లు కోర్టులో త‌మ వాద‌న‌లు వినిపించ‌బోతున్నారు.

ఇళ‌య‌రాజా గ‌దిని అడుగుతోంది.. ధ్యానం చేయ‌డానికి కాదు. అదీ ఒక‌రోజు కాదు. శాశ్వ‌తంగా. ఆ గ‌దిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇళ‌య‌రాజాకి అప్ప‌గిస్తే, దాన్ని త‌న శాశ్వ‌త ఆస్తిగా ఇళ‌య‌రాజా ఎందుకు భావిస్తున్నార‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. ఇళ‌య‌రాజాకు చెన్నైలో చాలా ఆఫీసులున్నాయి. అందులోనూ ఇళ‌య‌రాజా మ్యూజిక్ సిట్టింగులు నిర్వ‌హిస్తుంటారు. కాక‌పోతే… ప్ర‌సాద్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ చేయ‌డం ఇళ‌య‌రాజాకు సెంటిమెంట్. ఆ గ‌దికి ఇన్నేళ్లుగా ఆయ‌న అద్దె కూడా చెల్లించ‌డం లేదు. ఖాళీ చేయ‌మ‌న్న‌ప్పుడు కూడా `ఈ గ‌దికి నేను అద్దె క‌డతా` అని సైతం ఇళ‌య‌రాజా అడ‌గ‌లేదన్న‌ది… ప్ర‌సాద్ అధినేత‌ల వాద‌న‌. ఈ ఒక్క గ‌ది కోసం ఇళ‌య‌రాజా ప‌ట్టుప‌ట్ట‌డం, కోర్టుకు ఎక్క‌డం ఏమిట‌న్న‌ది ఆయ‌న అభిమానుల‌కు సైతం అర్థం కావ‌డం లేదు. ఈ కేసు విష‌యంలో సోమ‌వారం చెన్నై హై కోర్టు కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close