సాగర్‌లో టీఆర్ఎస్‌కు ఏకగ్రీవం కావాలట..!?

చనిపోయిన ప్రజాప్రతినిధుల కుటుంబాల్లోని వారికి ఉపఎన్నికల్లో ఏకగ్రీవం చేసే సంప్రదాయం ఉందని… నాగార్జునసాగర్‌లోనూ విపక్షాలు అదే పాటించాలని.. టీఆర్ఎస్ నేత.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అడుగుతున్నారు. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో ప్రస్తుతం అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. ఉపఎన్నిక అంటే.. టీఆర్ఎస్‌కు ఆందోళన ప్రారంభమయింది. దీంతో… నాగార్జునసాగర్‌ గండాన్ని ఎలా గట్టెక్కాలన్నదానిపై టీఆర్ఎస్ చర్చోపచర్చలు నిర్వహిస్తోంది. గాల్లో ఓ రాయి వేద్దామన్నట్లుగా ఏకగ్రీవం ప్రస్తావన కూడా తీసుకు వచ్చింది. గుత్తా ప్రతిపాదనపై విపక్ష పార్టీల నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఓ సారి.. వెక్కి తిరిగి చూసుకోమని సెటైర్లు వేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే… వారి కుటుంబసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ దాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు… కనీసం సానుభూతి కూడా లేకుండా.. తెలంగాణ సెంటిమెంట్‌తో.. అభ్యర్థుల్ని పోటీ చేయించారు. పాలెరులో వెంకటరెడ్డి… నారాయణఖేఢ్‌లో పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండేవారు. వారు చనిపోవడంతో ఉపఎన్నికలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఈ ఏకగ్రీవ సంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు తన పార్టీ నేతల్ని పెట్టి… పెద్ద ఎత్తున పార్టీ బలగాలను మోహరించి.. విజయం సాధించారు. పాలేరులో తుమ్మలను గెలిపించారు. ఖేడ్‌లో భూపాల్ రెడ్డిని గెలిపించారు. సంప్రదాయాలను పాటించాలని అప్పట్లో విపక్ష నేతలు చెప్పినా లెక్క చేయలేదు.

ఇప్పుడు.. టీఆర్ఎస్‌కు గడ్డు కాలం వచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చనిపోతున్నారు. దుబ్బాక లాంటి చోట్లోనే తెలంగాణ సెంటిమెంట్ పని చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది. అదే సమయంలో ఉపఎన్నికల్లో అధికార పార్టీ అడ్వాంటేజ్.. . పథకాలు కూడా పారడం లేదని.. గ్రేటర్ ఎన్నికల్లో తేలిపోయింది. మరో వైపు.. బీజేపీ ఎదిగిపోతోంది. ఉపఎన్నికల ద్వారా.. ఆ పార్టీకి మరింత అవకాశం కల్పిస్తున్నట్లుగా అవుతోంది. ఇప్పుడు… తనకు అవసరం వచ్చింది కాబట్టి.. టీఆర్ఎస్ … ఏకగ్రీవం.. సంప్రదాయాల్ని బయటకు తెస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

‘కృష్ణ‌మ్మ’ రివ్యూ: కొన్ని అల‌లు… ఇంకొన్ని సుడిగుండాలు

Krishnamma Movie Review తెలుగు360 రేటింగ్: 2.75/5 కొన్ని క‌థ‌ల్ని మ‌ల‌యాళ, త‌మిళ ద‌ర్శ‌కుడు డీల్ చేసే విధానం భ‌లే బాగుంటుంది. వాస్త‌విక‌త‌కు అద్దం ప‌ట్టేలా స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఆయా క‌థ‌ల్లో జీవం ఉట్టిప‌డుతుంటుంది. సినిమాటిక్...

ద‌ర్శ‌కురాలిగా ఆర్.జే!

ఆర్జే.. (రేడియో జాకీ)ల‌కూ టాలీవుడ్ కు గట్టి అనుబంధ‌మే ఉంది. కొంత‌మంది ఆర్‌.జేలు న‌టుల‌య్యారు. ఇంకొంత‌మంది డ‌బ్బింగ్ ఆర్టిస్టులుగా మారారు. కొంద‌రు హీరోలుగానూ మారారు. ఇప్పుడు ఓ ఆర్‌.జే మెగాఫోన్ ప‌ట్ట‌బోతోంది. త‌నే.....

ఇసుక అక్ర‌మ మైనింగ్- జ‌గ‌న్ స‌ర్కార్ పై సుప్రీం సీరియ‌స్

ఇసుక అక్ర‌మ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేత‌ల‌కు ఎంత బిజినెస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నేత‌లంతా సిండికేట్ అయి ఇసుక‌ను బంగారంలా ధ‌ర‌లు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్ల‌గొట్టిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close