ఫేక్‌న్యూస్ ఎఫెక్ట్ : రాజ్‌దీప్‌పై రెండు వారాలు వేటేసిన ఇండియాటుడే..!

ఇంగ్లిష్ న్యూస్ చానల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనల నేపధ్యంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్‌పై రెండు వారాలు వేటు వేసింది. ఆయనను రెండు వారాల పాటు స్క్రీన్ పైకి రాకుండా వేటు వేసింది. అంతే కాదు.. ఒక నెల రోజుల పాటు జీతాన్ని కత్తిరించాలని నిర్ణయించింది. ఇండియా టుడే యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం మీడియా వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఎందుకంటే ఆయన ఆ చానల్‌కు కన్సల్టింగ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నారు. ప్రైమ్ టైమ్ లో ఆ చానల్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ రైతు చనిపోయాడు. ఆయన పోలీసు కాల్పుల్లోనే చనిపోయాడని.. రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రచారం చేశారు. ఎన్డీటీవీ ప్రచారాన్ని ఇతర మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. దీంతో రైతులపై పోలీసులు కాల్పులు జరిపారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. అయితే పోలీసులు శరవేగంగా స్పందించారు. ఆ రైతు చనిపోయిన ప్రదేశంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు. వేగంగా వచ్చిన ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ఉన్న రైతు తీవ్ర గాయాల పాలై చనిపోయారని పోలీసులు ప్రకటించారు. సీసీ టీవీ ఫుటేజీలోనూ అదే ఉంది. దాంతో రాజ్ దీప్ సర్దేశాయ్ తప్పు చేసినట్లుగా తేలింది.

భారతీయ జనతా పార్టీకి రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యతిరేకంగా ఉంటారన్న ప్రచారం ఉంది. గతంలో ఆయనపై అమెరికాలో మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దాడి కూడా చేశారు. రిలయన్స్ గ్రూప్ చేజిక్కించుకోక ముందే సీఎన్ఎన్ ఐబీఎన్‌లో కీలక పాత్ర పోషించేవారు. న్యూస్ 18చేతికి ఆ చానల్ వెళ్లిన తర్వాత బయటకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఇండియా టుడేలో చేరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close