ఎస్‌ఈసీపై తిట్లవర్షం..! అసహనమా..? రెచ్చగొట్టే వ్యూహమా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న దాడి .. చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఎన్నికలు నిర్వహించడమే మహాపాపమన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది. ఆయనేదో అంటరానిఅధికారి అన్నట్లుగా ఒక్కొక్కరు మీడియా ముందు ప్రతిపక్ష రాజకీయ నేతల్ని తిట్టినట్లుగా తిడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఆయన డీఎన్‌ఏల గురించి… శరీర రంగు గురించి.. మాట్లాడేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎంతో మంది కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్ విధులు నిర్వహించి ఉంటారు కానీ.. ఎవరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండరు.

ఎన్నికల కమిషన్‌పై సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూంటాయి. ఒక వేళ తాము ఏమీ విమర్శించకపోతే.. వారు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తారన్న భావనతోనే అయినా విమర్శలు చేస్తారు. కానీ ఆ విమర్శలు హద్దుల్లోనే ఉంటాయి. తప్పులు మాత్రమే ఎత్తి చూపేవారు . కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరుగా ఉంది. ఎస్‌ఈసీ ఏం తప్పు చేస్తున్నారో చెప్పడం లేదు కానీ అధికార పార్టీ ఆయనపై దుమ్మెత్తి పోస్తోంది. తిట్టినతిట్టు తిట్టకుండా తిడితే.. ఆయన మానసికంగా బలహీనపడిపోయి.. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్నట్లుగా వైసీపీ నేతల ప్రవర్తన ఉంది. ప్రతిపక్ష నేతలపై ఇప్పటికే ఇలాంటి వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తోంది. ఇప్పుడు… ఎస్‌ఈసీపైనా ప్రయోగిస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ను అంత దారుణంగా తిట్టాల్సిన విమర్శించాల్సిన సందర్భం ఏమిటో వైసీపీ నేతలు చెప్పలేకపోతున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం నిబంధనలకు విరుద్ధమైతే.. అదే విషయాన్ని ప్రస్తావించవచ్చు. కానీ నిమ్మగడ్డ జిల్లాల పర్యటనకు వెళ్లినా విమర్శిస్తున్నారు. అధికారులతో సమీక్షలు పెట్టినా విమర్శిస్తున్నారు. తన విధులు తాను నిర్వహించినా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకన్నది చాలా మంది వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ధైర్యంగాఎన్నికలను ఎదుర్కొని ప్రజల్లోనే సత్తా చూపుదామని మెజార్టీవైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ.. వైసీపీ హైకమాండ్ మాత్రం నిమ్మగడ్డను ఏదో విధంగా విమర్శించాలనే పనిలోనే ఉంది. ఆయనను రెచ్చగొట్టి ఏదో ఓ తప్పు చేస్తే దాన్ని హైలెట్ చేయాలన్న వ్యూహం కూడా ఇందులో ఉండి ఉండవచ్చు.

ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తున్నారన్నఅభిప్రాయం అన్ని వర్గాల్లో ఏర్పడుతోంది. సుప్రీంకోర్టు కూడా అహన్ని తగ్గించుకోవాలని సూచించింది. కానీ ఏపీ సర్కార్ పెద్దలు అదేమీ పట్టించుకోవడం లేదు. చెలరేగిపోతున్నారు. ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి ఇష్టం లేనంత మాత్రాన.. ఎస్‌ఈసీపై ఇలా చెలరేగిపోవడం ప్రజాస్వామ్య లక్షణం కాదన్నవిమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలను తిట్టే తిట్లలా నిమ్మగడ్డను తిడుతున్నారు. ఆయన తన పని తాను చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం తటస్థుల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close