మీడియా వాచ్ : ఆ పీఆర్వో లీలలు ఇన్నిన్ని కాదయా..!

తెలంగాణ మీడియాలో ఇప్పుడు గటిక విజయ్ కుమార్ అనే కేసీఆర్ పీఆర్వో లీలలు హైలెట్ అవుతున్నాయి. మూడు రోజుల కిందటే పీఈర్వో గటిక విజయ్ కుమార్‌ను ప్రగతి భవన్ నుంచి గెంటేశారు. పదవుల నుంచి తీసేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆయనకు ట్రాన్స్‌కోలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ అనే శాశ్వత ఉద్యోగం కూడా కేసీఆర్ గతంలో కల్పించారు. ఆ పోస్టు నుంచి కూడా రాజీనామా తీసుకున్నారు. కేసీఆర్‌కు ఎంతో నమ్మకస్తుడిగా తిష్ట వేసిన విజయ్ కుమార్‌పై కేసీఆర్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణంఏమిటన్నదానిపై ఒక్కొక్క అంశం బయటకు వస్తోంది.

గటిక విజయ్ కుమార్ .. తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వరాష్ట్ర ఫలాన్ని పొందిన జర్నలిస్టుల్లో మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అలా ఫలితాలు రాగానే ఇలా కేసీఆర్ పీఆర్వో అయిపోయారు. సీపీఆర్వో ఉంటారు.అయినప్పటికీ.. ఆయనదే డామినేషనర్. ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా కేసీఆర్ వెనుక సెక్యూరిటీ వాళ్లు ఉంటారో లేదో కానీ..ఫోకస్‌లో మాత్రం విజయ్ కుమార్ ఉండేవారు. మొదట్లో సిన్సియర్‌గా ఉన్నట్లుగా షో చేశారు. ఈ కారణంగానే విజయ్‌కుమార్‌కు పర్మినెంట్ ఉద్యోగాన్ని కేసీఆర్ ట్రాన్స్‌కోలో ఇప్పించారు. కానీ అసలు ఆయన విశ్వరూపాన్ని అక్కడి నుంచే చూపించడం ప్రారంభించారు. ముఖ్యమంత్రికి వెన్నంటి ఉండే వ్యక్తిగా అధికారవర్గాల్లో పలుకుబడి పెంచుకున్నారు. ట్రాన్స్‌కో లో మేనేజర్ పోస్టు కూడా రావడంతో ఇక రెండింటిని సమన్వయం చేసుకుని రెండు చేతులా సంపాదన ప్రారంభించారని చెబుతున్నారు.

ట్రాన్స్ కోలో ప్రాజెక్టులు చేపట్టే కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూళ్లుచేయడం.. సెటిల్మెంట్లు చేయడం.. బంధువులకు ఉద్యోగాలు.. ఇసుక రీచ్‌లు ఇప్పించడంతో పాటు.. అనేక రకాలుగా అవినీతికి పాల్పడినట్లుగా తేలింది. చివరికి తనకు కేసీఆర్ దగ్గర పలుకుబడి ఉందని చెప్పి… ఉన్నతాధికారుల్ని సైతం బెదిరించి పనులు చేయించుకుకునేవారని చెబుతున్నారు. ఇటీవల ఓ అంశంలో ట్రాన్స్‌కోలో ఓ ప్రాజెక్ట్ లో భాగంగా తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఉన్నతాధికారులు చెప్పినా వినిపించుకోకపోవడంతో వారు నేరుగా కేసీఆర్ కు నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. అప్పటికే అనేకసార్లువిజయ్ కుమార్ పై ఆరోపణలు వచ్చి ఉండటంతో ఇంటలిజెన్స్‌తో కేసీఆర్ పూర్తి నివేదిక తెప్పించుకున్నారని చెబుతున్నారు.

ఇంటలిజెన్స్ సేకరించిన నివేదికలో… పీఆర్వో పోస్టును అడ్డం పెట్టుకుని గటిక విజయ్ కుమార్ సంపాదించింది.. మొత్తంగా ఆరేడు వందల కోట్ల వరకూ ఉంటుందని లెక్క తేలినట్లుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం.. బినామీల పేరుతో వ్యాపారాలు నెలకొల్పడం వంటి చర్యలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారాలతో మొత్తం ఫైల్ సీఎం వద్దకు చేరడంతో.. పిలిచి రాజీనామా లేఖ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయ్‌కుమార్‌కు జర్నలిస్ట్ సర్కిళ్లలో కూడా మంచి పేరు లేదు. ఆయనది అదోరకం మనస్తత్వం అని చెబుతూంటారు. అందుకే ఇప్పుడీయన వ్యవహారం జర్నలిస్టు సర్కిళ్లలోచర్చోపచర్చలకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close