ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండకూడదా..!?

వైసీపీలో ఉన్న పార్టీ నేతలందరికీ న్యాయం చేయడానికి సీఎం జగన్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా ఇచ్చిన ఆయన.. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోనూ అదే పద్దతి పాటించాలని నిర్ణయించారు. అంటే.. మున్సిపల్ కార్పొరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు.. మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్మన్లు ఉండనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు… పద్దెనిమిదో తేదీన మేయర్, చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఆ పదవుల పంపకంపై సీఎం జగన్ సుదీర్ఘంగా సమీక్ష చేశారు. పోటీ ఎక్కువగా ఉండటంతో రెండేసి డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్మన్ ల ఫార్ములాని పాటించాలని ఆదేశించారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు ఆర్డినెన్స్ సిద్ధం చేశారు. ఏ క్షణమైనా గవర్నర్‌కు పంపి ఆమోద ముద్ర వేయించుకునే అవకాశం ఉంది. రెండు మున్సిపాలిటీల్లో తప్ప.. అన్ని చోట్ల వైసీపీనే సులువుగా చైర్మన్ పీఠాన్ని గెల్చుకోనుంది. అయినప్పటికీ.. పార్టీ నేతలు నిరాశ పడకుండా పదవులు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఉపసర్పంచ్‌ల ఎంపికల సమయంలో అలాంటి ఆలోచన రాకపోవడంతో.. వాటి గురించి ఆర్డినెన్స్‌లో చేర్చలేదు. ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రేపు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. వాటి గురించి కూడా ఆర్డినెన్స్ లో పెట్టే అవకాశం లేదు. రేపు ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత అవసరం అయితే ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసే చాన్స్ ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

ఈవెంట్ కంపెనీ నిర్వాకం.. నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు

ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని చెప్పుకొనే ఓ సంస్థ చేసిన నిర్వాకం వ‌ల్ల‌, నిర్మాత‌ల‌కు త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి. పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అస‌లు మేట‌ర్...

క్రిష్ పేరు మిస్సింగ్‌.. ఏం జ‌రిగింది?

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు టీజ‌ర్ వ‌చ్చింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తామ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అది కూడా ఓకే. అయితే షాకింగ్ ఏమిటంటే......

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close