మీడియా వాచ్ : “ఈనాడు ఓన్లీ డిజిటల్‌”లో వాస్తవం ఎంత..?

ఈనాడు దినపత్రిక ప్రచురణను నిలిపివేయబోతోందని కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రామోజీరావుకు అత్యంత ఇష్టం అయిన చతుర, విపుల, తెలుగువెలుగు, బాలభారతం వంటి వాటిని ఆన్ లైన్ ఎడిషన్లు కూడా క్లోజ్ చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. పత్రిక ప్రింటింగ్ నిలిపివేసి ఇక ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితమవుతారని.. రామోజీ గ్రూప్ ఫార్మా రంగంలోకి వెళ్తుందన్న ప్రచారం కూడా చేస్తున్నారు. రామోజీ గ్రూప్ తదుపరి ఏ రంగంలోకి వెళ్తుందన్నది తర్వాత విషయం కానీ.. అసలు ఈనాడుపై ఈ రకమైన ప్రచారం జరగడానికి అంతర్గతంగా జరుగుతున్న చర్చలే కారణం అని చెబుతున్నారు.

వ్యాపారం అంటే పదేళ్ల ముందు పరిస్థితుల్ని అర్థం చేసుకుని దానికితగ్గట్లుగా వ్యాపారాన్ని మార్చుకోవాలన్నది రామోజీ గ్రూప్ సిద్ధాంతం. లేకపోతే మనుగడ ఉండదు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న కాలంలో మరింత ఆధునికంగా వ్యవహరించాలన్నది వారి ఉద్దేశం. ఆ ప్రకారం.. ముందు ముందు పరిస్థితుల్ని విశ్లేషించుకున్న రామోజీ గ్రూప్ పెద్దలు.. ప్రింటింగ్ ఎడిషన్‌కు ఆదరణ పెరగడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఓ వైపు న్యూస్ ప్రింట్ ధర పెరగడం.. రంగులు సలహా ప్రతీది ఖర్చు పెరిగిపోవడంతో ఇప్పటికే… ఆదాయం కరిగిపోతోంది. ఇక ఎలా చూసినా… పత్రికను చేతుల్లోకి తీసుకుని చదివే పాఠకుల సంఖ్య పెరగదని… ఫోన్లలో… ట్యాబుల్లో మాత్రమే చూసే వారి సంఖ్య పెరుగుతుందని అంచనాకు వచ్చారు. దాని ప్రకారమే.. తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.

వచ్చే మూడేళ్లలో మెల్లగా ప్రింట్ ఎడిషన్‌కు తగ్గిపోయే ఆదరణను బట్టి… మౌలిక సదుపాయాలు కూడా తగ్గించుకోవాలని నిర్ణయించారు.ఇప్పటికే కొన్ని చోట్ల.., ప్రింటింగ్‌ను ఔట్ సోర్సింగ్ కు ఇచ్చారు. మిగతా చోట్ల కూడా ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇటీవల జర్నలిజం స్కూల్‌లో కూడా… ప్రింట్‌ కోసం నియామకాలు చేయడం లేదు. డిజిటల్ కోసం మాత్రమే నియామకాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ విశ్లేషిస్తే.. ఈనాడు.. భవిష్యత్ టెక్నాలజీని ఊహించి… ఉనికి కాపాడుకోవడానికి ఇప్పటి నుండే మార్పుల కోసం ముందడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు. లేకపోతే… స్మార్ట్ శకాన్ని గుర్తించడానికి సిద్ధపడని… ఫోన్ల కంపెనీ నోకియాలా మారిపోతుందని నిర్ణయానికి వచ్చారు.

అయితే ఈ పరిస్థితి ఒక్క ఈనాడుదే కాదు. అన్ని దినపత్రికలు.. తమ ప్రింటింగ్ విభాగాన్ని మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చే మూడేళ్లలో రావొచ్చు. ఆయా కంపెనీలు కూడా దానికి తగ్గట్లుగా మెరుగైన ఏర్పాట్లు చేసుకోకపోతే.. ఇబ్బంది పడతారనేది.. న్యూస్ పేపర్ ఇండస్ట్రీ వర్గాల అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close