ఆ కేసు విషయంలో షర్మిలను టెన్షన్ పెడున్న కేసీఆర్..!

తెలంగాణ సర్కార్‌కు షర్మిలపై ఎనలేని అభిమానం ఉంది. ఆమెపై ఉన్న ఓ కేసును ఎత్తివేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ.. ఆ కేసు ఎత్తేస్తే అదే కేసులో ఉన్న తమ వ్యతిరేకులు కొండా మురళి, కొండా సురేఖలపైనా కేసు ఎత్తేయాల్సి ఉంటుంది. దీంతో షర్మిలకు రిలీఫ్ ఇవ్వడానికి తెలంగాణ సర్కార్… వేరే మార్గాలు అనుసరిస్తోంది. అయితే కోర్టు మాత్రం… అలా ఓ కేసులో ఉన్న కొంత మందిపై కేసు ఎత్తివేయడం.. కొంత మందిపై కొనసాగించడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న వినిపిస్తోంది. దీంతో తెలంగాణ సర్కార్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. అసలు కేసు టీఆర్ఎస్ దృష్టిలో చిన్నది కాదు. పెద్దదే. అదేమిటంటే… 2012లో పరకాలలో ఉపఎన్నికలు జరిగాయి. వైసీపీ తరపున కొండా సురేఖ పోటీపడ్డారు. టీఆర్ఎస్ తరపున భిక్షపతి పోటీ చేశారు.

ఆ సందర్భంగా పోటీ తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయినట్లయితే.. ఉద్యమ హవా తగ్గిపోయేది. కానీ స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. ఆ సమయంలో పోటీ చేసిన కొండా సురేఖ తరపున ప్రచారానికి షర్మిల, విజయలక్ష్మి వెళ్లారు. అయితే.. అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని అప్పుడు కేసు నమోదైంది. ప్రజాప్రతినిధులపై కేసులను త్వరగా తేల్చే ఉద్దేశంలో ఉన్న న్యాయస్థానాలు ఇటీవల ఇలాంటికేసులన్నింటినీ త్వరత్వరగా విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో షర్మిల, విజయలక్ష్మిల కేసు కూడా విచారణకు వస్తోంది. ఓ సారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ లోపు కేసును ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది.

ప్రభుత్వం కూడా..షర్మిళ, విజయలక్ష్మిలపై ఉపసంహరించుకోవాలనే అనుకుంటోంది. ఇది ఒక్క రోజులోనే పని. కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. విజయమ్మ, షర్మిళపై మాత్రమే కేసు ఉపసంహరించే ఉద్దేశం కనిపిస్తోందని.. హైకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్సి ఉందని స్పష్టం చేశారు. 31న విజయమ్మ, షర్మిళ సహా నిందితులందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మామూలుగా అయితే ఈ కేసులో… అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించినట్లుగా ఆధారాలను అధికారులు సమర్పించినట్లుగా తెలుస్తోంది. దీంతో షర్మిల, విజయలక్ష్మిలపై కేసు ఉపసంహరించుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ వీరి పేరుతో.. కొండా దంపతులకు రిలీఫ్ ఇవ్వడానికి సిద్ధం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ కు హైకమాండ్ అభినందనలు..ఎందుకంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ లేవనెత్తుతోన్న అంశాల ఆధారంగా కాంగ్రెస్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో పెరుగుతోందని రేవంత్ పని తీరును...

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close