గంటా స్టీల్ ప్లాంట్ భేటీల పై వైకాపా అసహనం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కావడం దాదాపు ఖాయమైపోయింది. అయితే ప్రజల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం కావడం తో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతోంది అన్న ఆలోచన ప్రజల్లో భావోద్వేగాలను రగిలిస్తోంది. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాకుండా ఆ దిశగా కొన్ని అడుగులు కూడా గంటా శ్రీనివాసరావు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే గంటా స్టీల్ ప్లాంట్ అంశంలో వేస్తున్న అడుగులు అధికార వైఎస్సార్సీపీకి తీవ్ర అసహనం కలిగిస్తున్నాయని ఆ పార్టీ నేతల మాటలు, ట్వీట్ లని బట్టి అర్థమవుతుంది. స్టీల్ ప్లాంట్ విషయం లో గంటా ప్రయత్నాలపై వైకాపా అసహనం యొక్క కారణాలు ఏంటని విశ్లేషిస్తే…

ప్రతి సమస్యను రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం సహజమే:

దేశంలోని కీలకమైన రక్షణ, అణు ఇంధన శక్తి వంటి కొన్ని అంశాలు మినహాయిస్తే మిగతా అన్ని రంగాల్లోనూ ప్రైవేటుకు పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయానికి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఆర్థికవేత్తలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తే, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సంస్థల విషయంలో ప్రజల నుండి, ప్రాంతీయ పార్టీల నుండి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని రాజకీయ పార్టీలు కూడా తమకు అనుగుణంగా మలుచుకోవడానికి ప్రయత్నించాయి. వైఎస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో కలసి వేదికను పంచుకుని వారికి మద్దతు ఇస్తూ మాట్లాడితే, టిడిపి నేతలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం -పైకి స్టీల్ ప్లాంట్ కు మద్దతు ఇస్తున్నా కానీ అంతర్గతంగా బీజేపీకి ఎప్పుడో ఆమోద ముద్ర ప్రకటించిందని ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సిపి దానికి తిరిగి కౌంటర్ ఇస్తూ చంద్రబాబు హయాంలో నే ఇందుకు బీజాలు పడ్డాయి అని వ్యాఖ్యానించింది.

రాజకీయాలకు అతీతంగా పోరాడదాం అంటున్న గంటా శ్రీనివాసరావు:

రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రజాస్వామ్యంలో సహజం. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రత్యేకమైన స్టాండ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన టిడిపి నేత అయినప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పార్టీ పరమైన పోరాటం కంటే నాన్ పొలిటికల్ జేఏసీ ద్వారా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఇందుకోసం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ లతో ఆయన భేటీ అయి తదుపరి కార్యాచరణ చర్చించారు. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని తప్పు పడుతూ ఆంధ్ర ప్రజల ఆకాంక్షకీ, ఉద్యోగుల పోరాటానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా మద్దతు ప్రకటించిన కేటీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయి ప్లాంట్ సమస్య ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించారు గంటా శ్రీనివాసరావు.

గంటా ప్రయత్నాలపై వైఎస్ఆర్సిపి అసహనం:

అయితే గంటా శ్రీనివాసరావు చేస్తున్న ప్రయత్నాలను అధికార వై ఎస్ ఆర్ సి పి తప్పు పడుతోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గంటా శ్రీనివాస రావు పోరాటాన్ని ఎద్దేవా చేస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. విజయసాయి ట్వీట్ చేస్తూ, “వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు “గంటలు” కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో సొంత “గంట” మోగిస్తున్నారు. ఆ “గంట”లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ “గంట” శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో “భూగంట” మోగించలేదా?” అని రాసుకొచ్చారు. గంటా శ్రీనివాస రావు కేటీఆర్ ను కలిసినప్పుడు కూడా- తానొక్కడే కేటీఆర్ ను ఎలా వెళ్లి కలుస్తాడు అని విజయసాయిరెడ్డి గంటా శ్రీనివాసరావు ని ప్రశ్నించారు.

ఈ విషయంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ను కూడా విజయసాయిరెడ్డి వదిలిపెట్టలేదు. ” స్వామి వివేకానందునిలా బిల్డప్. సర్వీసులో ఉన్నంత కాలం అధికారంలో ఉన్నవారికి ఊడిగం. సీబీఐ అధికారిగా సోనియాకు గులాం. ఇప్పుడు వైజాగ్ స్టీల్‌ను కాపాడతానని బయలుదేరాడు. పోరాడాల్సిన చోట పోరాడడు. అడగాల్సిన వారిని అడిగడట. ఉక్కు కోసం తెగిస్తానని చెవుల్లో పెడుతున్నాడు క్యాలీఫ్లవర్.” అంటూ లక్ష్మీనారాయణను చులకన చేస్తూ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

ఇంత అసహనం ఎందుకు:

ఐతే వైఎస్ఆర్సీపీ నేతల అసహనం వెనుక తగిన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, కేవలం ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడే స్థాయి వరకు మాత్రమే పరిమితం కావాలని, అంతకుమించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కావడం వెనుక ఉన్న రాజకీయ కారణాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అయ్యే క్రమంలో జరిగిన రాజకీయ ఒప్పందాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అయిన తర్వాత ఇక్కడకు రానున్న కార్పొరేట్ ల తో ప్రభుత్వానికి ఇప్పటికే జరిగిన లేకపోతే ఇకపై జరగనున్న ఒప్పందాలు – ఇటువంటి అంశాలు తెరమీదకు రాకూడదని వైఎస్సార్ సీపీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఒక పెద్ద సంస్థ ప్రైవేటు పరం అయి వేరే వారి చేతుల్లోకి వెళ్లే క్రమంలో ప్రభుత్వానికి కార్పొరేట్ ల కి ఈ మధ్య కొన్ని ఒప్పందాలు జరగడం సహజం. కానీ ప్రజల్లో భావోద్వేగాలు ఎక్కువ స్థాయిలో రగులుకుంటే, ఆ ఒప్పందాలకు విఘాతం కలగడమే కాకుండా అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన ఉద్యమంగా మారకుండా, కేవలం ఉద్యోగుల ప్రయోజనాల అంశానికి సంబంధించిన ఉద్యమం గా మాత్రమే పరిమితం కావాలన్నది అధికార పార్టీ ఉద్దేశంగా కనిపిస్తోంది.

అయితే వైఎస్ఆర్ సిపి నేతల తీరు ని ప్రజలు, విశ్లేషకులు తప్పు పడుతున్నారు. ఉద్యమానికి మద్దతు పలకడం ఇష్టం లేకపోతే పూర్తిగా ఆ విషయాన్ని బహిరంగ పరచాలి లేదా ఉద్యమానికి మద్దతు పలకాలని ఉంటే సంపూర్ణ స్థాయిలో మద్దతు పలకాలి తప్పించి ఇలా అంతర్గతంగా తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూనే, బయటికి మాత్రం పెద్ద ప్రజా ఉద్యమం చేస్తున్నట్లు ప్రజలను మభ్య పెట్టడం సరికాదని వారి అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close