జానారెడ్డికి సీన్ అర్థమయింది..!

నేను సీనియర్‌ని .. నాకెవరూ ప్రచారంచేయాల్సిన అవసరం లేదు.. నేనొక్కడినే చేసుకుంటానని భీష్మించుకు కూ‌ర్చున్న జానారెడ్డికి .. నాగార్జున సాగర్‌లో పరిస్థితి అర్థమైపోయింది. ఓ వైపు టీఆర్ఎస్ బలగం మొత్తాన్ని దించి గ్రామాలను చుట్టబెడుతోంది. మరో వైపు కేసీఆర్ కూడా ప్రచారానికి వస్తున్నారు. దీంతో జానారెడ్డి… తన పట్టు సడలించుకోక తప్పలేదు. సీనియర్ల ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రేవంత్ సహా కీలకనేతలందరూ మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని రంగంలోకి దిగారు. సాగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు..రెండు మున్సిపాల్టీలు ఉన్నాయి. వీటిలో నేటి నుంచి కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయనున్నారు.

జానారెడ్డి ఇంతకు ముందు రెండు విధాలుగా ఆలోచించారు. ఒకటి.. ఉపఎన్నికల్లో ఎవరి సాయం లేకుండా గెలిస్తే… తెలంగాణ కాంగ్రెస్‌లో తనకంటే పోటుగాడు లేడన్న ఇమేజ్ వస్తుందని .. అలాగే… ఒక్క సారిగా కాంగ్రెస్‌లో కీలక స్థానానికి వెళ్లిపోవచ్చని ఆశపడ్డారు. అయితే అనుకున్నంత ఈజీగా పరిస్థితి లేదని తేలిపోయిన తర్వాత మెత్తబడాల్సి వచ్చింది. జానారెడ్డి సీనియర్ కావొచ్చు కానీ… ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ దశలో ఉన్నారు. కుమారుడి ద్వారా రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు సీరియస్‌గా తీసుకోకపోతే.. చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకున్న చందంగా అవుతుందన్న నిర్ణయానికి రావడంతో తన పట్టు సడలించారు.

జానారెడ్డి అంగీకరించడంతో ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ పదవుల్లో ఉన్న వారు.. సీనియర్లు అందరూ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. వారిని మండలాల వారిగా ఇంఛార్జీలుగా నియమించారు. వీరికి మరో పదిమంది డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులను బృందంగా అప్పగించారు. సాగర్‌లో ప్రస్తుతం పరిస్థితి హోరాహోరీగా ఉంది.ఏ పార్టీకి మొగ్గు లేని పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close