తమిళనాడులో డీఎంకేను గెలిపిస్తున్నది బీజేపీనే..!

ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో చాలా స్పష్టమైన తీర్పు వస్తుందని అందరూ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన రాష్ట్రం తమిళనాడు. అక్కడ ద్రవిడ దిగ్గజాలు ఇద్దరూ లేకుండా జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఒక్కడే లీడర్‌గా ప్రజల ముందు నిలబడ్డారు. అయితే ఏకపక్షంగా ఆయనకు ప్రజలు మద్దతివ్వడానికి బీజేపీనే కారణంగా చెప్పుకోవచ్చు. తమిళనాడులో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీతో జట్టు కట్టిన వారికి కూడా ఓట్లేసే పరిస్థితి లేదు. అయినప్పటికీ పట్టు బట్టి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని.. కొన్ని సీట్ల అయినా సరే తీసుకుని పోటీ చేశారు.

అంత వరకూ బాగానే ఉన్నా… ప్రచారంలో కూడా చురుగ్గా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేశారు మోడీ, అమిత్ షా. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకున్న డీఎంకే.,.. మరింత విస్తృతంగా మోడీ, అమిత్ షాలను అన్నాడీఎంకే తరపున ప్రచారం చేయాలని సెటైర్లు వేసేంత పరిస్థితి వచ్చింది. పరిస్థితిని… అన్నాడీఎంకే నేతలు..బీజేపీకి చెప్పే పరిస్థితి లేదు. అదే సమయంలో మోడీ, అమిత్ షాలు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వారు తరచూ ప్రచారం చేశారు. ఫలితంగా… సోషల్ మీడియాలో వారు తమిళనాడు వచ్చినప్పుడల్లా.. గో బ్యాక్ మోడీ, అమిత్ షా లు ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఈ పరిస్థితులకు తోడు… ఎన్నికలకు మూడు, నాలుగు రోజుల ముందు స్టాలిన్ కుమార్తె ఇంటిపై ఐటీదాడులు చేయించడం కలకలం రేపింది. స్టాలిన్ అల్లుడు అంటూ ప్రచారం చేయించినా.. కుమార్తెను అమిత్ షా టార్గెట్ చేశారన్న అభిప్రాయం తమిళుల్లో ఏర్పడింది. దీంతో ఢిల్లీ నాయకత్వంపై మరింత ఆగ్రహం తమిళుల్లో ప్రారంభమయింది. చివరికి స్టాలిన్‌కు ఈ ఎన్నికల్లో ఉన్న ప్లస్ పాయింట్లకు తోడు… బీజేపీ నేతలు మరింత బలాన్ని ఇచ్చినట్లయింది. ఫలితంగా స్టాలిన్ గెలుపు నల్లేరుపై నడకలాగా మారిపోయిందన్న అభిప్రాయం… తమిళనాడులోనే కాదు.. అంతటా వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close