ఏ జింద‌గీ : మ‌రో మంచి మెలోడీ!

టాలీవుడ్ లో ఈమ‌ధ్య గ‌ట్టిగా వినిపిస్తున్న సంగీత ద‌ర్శ‌కుడి పేరు.. గోపీ సుంద‌ర్‌. త‌న ఆల్బ‌మ్ అంటే.. ఖ‌చ్చితంగా మెలోడీల మ‌ణిహార‌మే. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`కీ త‌నే సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆల్బ‌మ్ నుంచి వ‌చ్చిన పాట‌ల‌న్నీ బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా `ఏజీందగీ` అనే పాట‌ని విడుద‌ల చేశారు. హీరో, హీరోయిన్ల మ‌ధ్య సాగే రొమాంటిక్ మాంటేజ్ గీతం ఇది. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన పాట‌కు…హ‌నియా న‌ఫీసా, గోపీ సుంద‌ర్ గాత్ర‌దానం చేశారు. ఈ లిరిక‌ల్ వీడియోని క‌ట్ చేసిన విధానం కూడా బాగుంది.

`ఆర్ యూ రెడీ ఫ‌ర్ డ్రైవ్ విత్ అజ్` అంటూ… అఖిల్ ఓ కారులో, పూజా మ‌రో కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్న‌ట్టు… వీడియో షూట్ చేసి, దాన్ని ఈ లిరిక‌ల్ వీడియోకి క‌లిపారు. మ‌రో కారులో… బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌, గోపీ సుంద‌ర్ తో పాటు, గాయ‌నీ గాయ‌కులు కూడా… లాంగ్ డ్రైవ్ కి బ‌య‌ర్దేర‌డం ఈ పాట‌లో క‌నిపిస్తుంది.

ఎప్ప‌టిలా రామ జోగ‌య్య శాస్త్రి క‌లం నుంచి మంచి ప‌దాలు ప‌డ్డాయి. లిరిక్ చాలా సింపుల్ గా, ట్యూన్ హాంటింగ్ గా సాగింది.

ఆకాశ‌మంతా ఆనంద‌మై
తెల్లారుతోంది… నా కోస‌మై
ఆలోచ‌నంతా ఆరాట‌మై
అన్వేషిస్తోంది… ఈ రోజుకై

అంటూ మొద‌లైన ఈ పాట‌లో…

కాలాలు ప‌రుగ‌య్యేలా
ప్రాణాలు వెలుగ‌య్యేలా
ఓ తోడు దొరికెనేడు … త‌న‌లాగా…

నా పెద‌వంచుకు త‌న పేరు తోర‌ణం..
నా చిరున‌వ్వుకు త‌నేగా కార‌ణం.. – అనే మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. మొత్తానికి గోపీ సుంద‌ర్ నుంచి వ‌చ్చిన మ‌రో మెలోడీ ఇది. కొన్నాళ్ల పాటు హాయిగా పాడుకోవొచ్చు. వినొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close