వైజాగ్ ఫర్ సేల్..! కొనుక్కుంటారా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా రాజధాని చేయాలనుకున్న విశాఖలో ముందుగా భూముల్ని అమ్మేస్తోంది. రాజధాని చేయాలనుకున్నప్పుడు అక్కడ లెక్క లేనన్ని అవసరాలు ఉంటాయి. వాటి కోసం ప్రభుత్వ భూములేమైనా ఉంటే జాగ్రత్త చేసుకుంటారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అక్కడకు రాజధాని తరలించక ముందే… అందుబాటులో ఉన్న విలువైన భూములన్నింటినీ అమ్మేస్తోంది. మంచి ధర కోసం మార్కెటింగ్ విస్తృతంగా చేస్తోంది. ఇండియన్స్ వద్ద డబ్బులున్నాయో లేవో కానీ.. ఎన్నారైలయితే పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరిస్తారని అనుకున్నారో లేక మరో కారణమో కానీ.. వేలం వేసే బ్రోకరేజీ సంస్థ ఎన్‌బీసీసీ ద్వారా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మెయిళ్ల ప్రమోషన్ చేస్తున్నారు. వీటిని అందుకుంటున్న ఎన్నారైలు… ముక్కు మీద వేలేసుకోవాల్సి వస్తోంది.

లూలూకి ఇచ్చిన స్థలం సహా 18 ఆస్తులకు ఫర్ సేల్ బోర్డు..!

ఆగనంపూడి, ఫకిర్ టకియా ప్రాంతాల్లోని ఐదు స్థలాలతో పాటు బీచ్‌ రోడ్‌లో ఉన్న మరో స్థలాన్ని వేలానికి పెట్టారు. ఆగనంపూడి, ఫకిర్‌టకియాలో ఉన్న ఐదు స్థలాలు.. అన్ని ఎకరం.. అర ఎకరం లోపువే. దీంతో వీటి విలువ నాలుగైదు కోట్ల మధ్యలోనే ఉంటుంది. కానీ బీచ్‌లో వేలానికి పెట్టిన స్థలం మాత్రం పదమూడున్నర ఎకరాలు ఉంటుంది. ఇది అత్యంత విలువైనది. దీని విలువను 1452కోట్లుగా నిర్ధారించారు. ఇవికాకుండా… మరిరొన్ని స్థలాలను కూడా వేలానికి పెట్టారు. మొత్తానికి పద్దెనిమిది ప్రభుత్వ ఆస్తులను అమ్మాలని నిర్ణయించారు.

బిడ్లు తీసేసుకుంటున్న ఎన్‌బీసీసీ..!

బీచ్‌రోడ్డులోని పదమూడున్నర ఎకరాల స్థలంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన మాల్ కం కన్వెన్షన్ సెంటర్ కట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన లూలూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వైసీపీ సర్కార్ రాగానే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. లూలూను గెంటేసింది. ఇప్పుడు మొత్తం ఆ స్థలాన్ని అమ్మేస్తోంది. ఎన్‌బీసీసీ సంస్థ ఆయా భూములు, స్థలాల ఫొటోలు, లేఅవుట్‌ కాపీలు, ప్లాట్‌ నెంబర్లు అన్ని వివరాలను తెలిపి ఫర్ సేల్ బోర్డు పెట్టేసింది. వేలానికితేదీ నిర్ణయించింది. వేలంలో పాల్గొనేవారి వద్ద నుంచి ముందస్తు డిపాజిట్ కూడా సేకరిస్తోంది.

రాజధాని పేరుతో విలువలు పెంచేసుకుని అమ్మేసుకుంటున్నారా..?

విశాఖలో పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకు వస్తారని అక్కడి ప్రజలు ఆశిస్తే… రాజధాని పేరుతో విలువలు పెంచి ప్రభుత్వ భూముల్ని తెగనమ్మే ప్రయత్నం చేయడం… విశాఖ వాసుల్ని విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే రావాల్సిన పరిశ్రమల్ని వెళ్లగొట్టి.. ఇప్పుడు భూముల్ని అమ్మేస్తూ.. ఈ ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేస్తుందా లేదా… అంతర్గతగా ఎజెండాతో ఇంకేమైనా వ్యూహం అమలు చేస్తుందా అన్న అనుమానానికి సామాన్య ప్రజలు రావాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close