‘పుష్ష’ 2 భాగాలుగా రానుందా?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా `పుష్ష‌`. రేపు బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా పుష్ష‌రాజ్ ని ప‌రిచ‌యం చేయ‌బోతోంది టీమ్‌. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంది? అంటూ సుకుమార్‌, బ‌న్నీ తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార్ట‌. దానికి రెండు కార‌ణాలున్నాయి. `పుష్ష‌` చాలా విస్తార‌మైన క‌థ‌. ఇప్ప‌టి వ‌ర‌కూ రాసుకున్న స‌న్నివేశాలు ఉన్న‌ది ఉన్న‌ట్టు తీస్తే 3 గంట‌ల‌కు పైబ‌డి ఫుటేజ్ రాబోతోంద‌ట‌. అదీ కాక‌… సుకుమార్ ద‌గ్గ‌ర ఈ సినిమాని కొన‌సాగించే పాయింట్ కూడా ఉంద‌ట‌. ఆ రెండూ క‌లిపి ఒకేసారి తీసేసి, రెండు నెల‌ల గ్యాప్ లో ఈ రెండు భాగాల్నీ విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంది? అనే విష‌యంపై అటు బ‌న్నీ, ఇటు సుకుమార్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని టాక్‌. ఒకే భాగంగా ఈసినిమాని విడుద‌ల చేయాల‌నుకుంటే, అనుకున్న స‌మ‌యానికే ఈ సినిమా విడుద‌ల అవుతుంది. లేదంటే.. వాయిదా ప‌డుతుంది.

ఓర‌కంగా ఇది బాహుబ‌లి స్ట్రాట‌జీనే. బాహుబ‌లి కూడా ఒకే భాగం అనుకున్నారు. కానీ.. నిర్మాణ ద‌శ‌లో, క‌థ విస్తారం పెరిగి, రెండు భాగాలైంది. అది నిర్మాత‌ల‌కు బాగా వ‌ర్క‌వుట్ అయిన స్ట్రాట‌జీ. దాన్ని `పుష్ష‌` కీ కొన‌సాగించ‌బోతున్నారు. అయితే ఈ విష‌యంపై ఇంకా తుది నిర్ణ‌య‌మైతే తీసుకోలేదు. బ‌న్నీ, సుకుమార్ ఇద్ద‌రూ ఓకే అనుకుంటే, పుష్ఫ 1, పుష్ష 2 కూడా ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close