ఇదేం మ్యాచ్ రా బాబూ…?!

క్రికెట్ అంటేనే విచిత్రం. ఎప్పుడు ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చెప్ప‌లేం. అందుకు ఐపీఎల్ లో భాగంగా సాగిన ముంబై – కొల‌కొత్తా మ్యాచ్‌నే ఉదాహ‌ర‌ణ‌. ముంబైపై ఈజీగా గెలుస్తుంద‌నుకున్న కొల‌కొత్తా.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి.. ముంబైకి మ్యాచ్ అప్ప‌గించింది. 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే. అదే సీన్ రిపీట్ అయ్యింది. బెంగ‌ళూరు – హైద‌రాబాద్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌… క్రికెట్ ప్రేమికుల్ని విస్మ‌య ప‌రిచింది. 150 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ ఓ ద‌శ‌లో సునాయాసంగా విజ‌యం సాధిస్తుంద‌నిపించింది. అయితే అనూహ్యంగా వికెట్లు కోల్పోయి.. 6 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. 150 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ ఓ ద‌శ‌లో ఒక వికెట్ కోల్పోయి 96 ప‌రుగులు చేసింది. రెండు ఓవ‌ర్ల ముందే.. హైద‌రాబాద్ విజ‌యం సాధిస్తుంద‌నుకుంటే, అనూహ్యంగా హైద‌రాబాద్ కుప్ప‌కూలింది. బ్యాటింగే రానట్టు.. ఒక‌రి వెంట ఒక‌రు పెవీలియ‌న్ కి చేరారు. ష‌బ్‌నాజ్ ఒకే ఓవ‌ర్లో 3 వికెట్లు కోల్పోయింది. చివ‌రికి విజ‌య‌ల‌క్ష్యానికి 6 ప‌రుగుల దూరంలో ఆగిపోయింది. ముంబై – కొల‌కొత్తా మ్యాచ్‌… అనూహ్య‌మైన ఫ‌లితాన్ని తీసుకురావ‌డంతో… క్రికెట్ ప్రేమికులు విస్మ‌య ప‌డ్డారు. ఇదేమైనా ఫిక్సింగా అన్న‌ట్టు అనుమానించారు. స‌రిగ్గా హైద‌రాబాద్ – బెంగ‌ళూరు మ్యాచ్ కూడా అలానే సాగింది. ఇప్పుడేమంటారో?????

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్… ప్రమాదంపై అనుమానాలు..!

ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని ఇరాన్ తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది....

ఎన్టీఆర్… ఎందుకంత‌ స్పెషల్ ?!

నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన హీరో... రెండు దశాబ్దాల తర్వాత కూడా అగ్రపధంలో కొనసాగడం అంటే అదొక స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌ ప్రయాణంలానే చూడాలి. ఇలాంటి అద్భుత నట జీవితం జూనియర్...
video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close