కాంట్రాక్టులిస్తామంటే పారిపోతున్నారు..!

ఎవరైనా ప్రభుత్వ రంగంలో ఏదైనా కాంట్రాక్ట్ వస్తుందంటే కళ్లకు అద్దుకుని తీసుకుంటారు. అలాంటి కాంట్రాక్టుల కోసం పైరవీలు చేస్తూంటారు. తృణమో..పణమో సమర్పించకుంటామని.. ఆశ పెడుతూంటారు. ఎక్కువగా…కాంట్రాక్ట్ పనులు… అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు లేదా… అగ్రనేతల బినామీలే చేస్తూంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఏపీలో అయితే రివర్స్ అయిపోయింది. కాంట్రాక్టులు ఇస్తామంటే… ఎవరూ ముందుకు రావడం లేదు. వద్దంటే వద్దంటున్నారు. అధికారులు సమావేశాలు పెట్టి…టీ కాఫీలు ఇచ్చి.. బుజ్జగించి.. బతిమాలి.. బామాలి… చెప్పినా… ఇంకేమైనా చెప్పండి కానీ.. కాంట్రాక్టులు మాత్రం తీసుకోమని అంటున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయి. ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. దీంతో అప్పులుతీసుకుని రోడ్లు బాగు చేయాలని పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీనికి అధికారులు టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్లు ముందుకు వస్తేగా..?. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఓ ఎనభై శాతం పనులకు మాత్రం కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. ఇతర చోట్లా ఎక్కడా పది శాతానికంటే ఎక్కువగా వేయలేదు. దీనికి ప్రత్యేకంగా కారణం చెప్పాల్సిన పని లేదు. డబ్బులు ఇస్తుందని ప్రభుత్వంపై నమ్మకం లేదు. డబ్బులు ఇవ్వని దానికి తాము పెట్టుబడి పెట్టి ప్రభుత్వం చుట్టూ తిరగడం… అందరికీ కమిషన్లు ఇచ్చుకోవడం ఎందుకని మిన్నకుండిపోయారు. అందుకే ప్రభుత్వం వారి కోసం… నేరుగా బ్యాంకుల నుంచి బిల్లులు చెల్లిస్తామని కొత్త ప్రపోజల్ పెట్టింది. కానీ కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడం లేదు.

నిజానికి వారికి పాత బకాయిలు చాలా రావాల్సి ఉంది. వాటి గురించి ప్రభుత్వం చెప్పడం లేదు. గతంలో చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు కొత్త పనులు చేయమంటే ఎలా అని అధికారుల్ని నిలదీస్తున్నారు. వీటికి అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు తాము బిల్లులు ఇవ్వబోమని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుకుంది. రెండేళ్లుగా అటు ఉపాధి హామీ దగ్గర్నుంచి ఇటు రోడ్ల పనులు చేసిన వారికీ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు విశ్వాసం కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close