ఏపీలో సంస్కారం తెలీని లీడర్ ఆయనొక్కరే..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 71 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 72వ ఏట అడుగు పెట్టారు. ఆయనంటే అభిమానం ఉండి.. చెప్పాలి అనుకున్న వాళ్లు చెప్పారు. టీడీపీ క్యాడర్ కేకులు కట్ చేసుకుంది. తమ అధినేతకు.. సోషల్ మీడియా ద్వారానో.. మీడియా ద్వారానో శుభాకాంక్షలు చెప్పారు తెలుగు తమ్ముళ్లు. ఇక టీడీపీ సోషల్ మీడియా… చంద్రబాబు పుట్టినరోజును హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేసుకుంది. అది వారి అభిమానం. ప్రతిపక్ష నేతకు ముఖ్యమంత్రి జగన్ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒకే ఒక్కరు మాత్రం.. చంద్రబాబు పుట్టిన రోజును కూడా కించ పరుస్తూ.. దారుణమైన భాషతో ట్వీట్లు చేశారు. ఆ ఒక్కరే చదువుగొప్ప విజయసాయిరెడ్డి.

పెద్ద చదువులు చదువుకుని.. టక్ జగదీష్ టైప్‌లో చదువుకున్నవాళ్లకు మంచి సంస్కారం ఉంటుందన్నట్లుగా రూపురేఖల్లో కనిపించే ఆయన.. మాటల్లో మాత్రం.. కనీసం సంస్కారం కూడా మర్చిపోయారు. ఏప్రిల్ నెల ఇరవయ్యో తేదీన చంద్రబాబు పుట్టారని.. 420 అంటూ.. చంద్రబాబుపై తిట్లు లంకించుకున్నారు. ఆయన చేతిలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కూడా… టీడీపీ సోషల్ మీడియాతో పోటీ పడి.. చంద్రబాబును 420 అంటూ ట్వీట్లను ట్రెండ్ చేసేందుకు కష్టపడింది. అది సోషల్ మీడియా యుద్ధం అనుకుందాం.. కానీ గౌరవనీయ పదవిలో ఉన్న విజయసాయిరెడ్డికి.. ఇంత అగౌరవంగా ఎందుకు స్పందించాల్సి వస్తోందనేది చాలా మందికి అర్థం కాని విషయం. 420 అని పదాన్ని వినియోగించాల్సి వస్తే రాజకీయ నేతల్లో మొదటగా…విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత జగన్ పేరునుప్రస్తావిస్తారు.

ఎందుకంటే వీరిపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ప్రతీ కేసులోనూ 420 సెక్షన్ ఉంది. అలా రికార్డుల్లో ఉన్న వ్యక్తే.. ఇతరుల్ని 420 అంటే.. ఊరుకుంటారా..? సోషల్ మీడియా అంతా.. విజయసాయిరెడ్డి 420 కేసుల చరిత్రను తవ్వి పెట్టారు. దాంతో ఆయన కూడా హైలెట్ అయ్యారు. అయితే ఇలా హైలెట్ అవడం ఆయనకు గౌరవంగా ఉంటుందేమో కానీ.. ఏపీ రాజకీయాల్లో ఏ మాత్రం డీసెన్సీ లేని ఒకే ఒక్క నేతగా పేరు మాత్రం సుస్థిరం చేసుకున్నారని సోషల్ మీడియాలో బిరుదు ఇచ్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close