ఇండియ‌న్ 2… మ‌ద్రాస్ హైకోర్టు తీర్పు

క‌మ‌ల్ హాస‌న్ – శంక‌ర్ ల సినిమా `ఇండియ‌న్ 2` వివాదాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వివిధ కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో `ఇండియ‌న్ 2`ని ప‌క్క‌న పెట్టి, మ‌రో రెండు సినిమాల ప‌నుల్ని మొద‌లెట్టాడు శంక‌ర్‌. ఈ విష‌య‌మై `ఇండియ‌న్ 2` నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్.. కోర్టు కెక్కింది. `ఇండియన్ 2` పూర్తి కాకుండా మ‌రో సినిమా మొద‌లెట్ట‌కుండా తీర్పు ఇవ్వాల‌ని మ‌ద్రాస్ కోర్టుని కోరింది. దీనిపై న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. `ఈ విష‌యాన్ని మీరే ప‌రిష్క‌రించుకోండి` అని తేల్చింది. త‌దుప‌రి తీర్పుని ఈనెల 28కి వాయిదా వేసింది. దాంతో బంతి మ‌ళ్లీ నిర్మాత – ద‌ర్శ‌కుడి మ‌ధ్య ఆగిన‌ట్టైంది.

ఇది వ‌ర‌కే శంక‌ర్ – లైకాల మ‌ధ్య చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. వీరిద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చ‌డానికి క‌మ‌ల్ చాలా ప్ర‌య‌త్నించాడు. కానీ అవేమీ ఫ‌లితాల్ని ఇవ్వ‌లేక‌పోయాయి. శంక‌ర్ ఇప్ప‌టికీ `ఇండియ‌న్ 2` పూర్తి చేస్తాన‌నే చెబుతున్నాడు. మ‌రో 20 శాతం చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బాకీ ఉంద‌ని, త్వ‌ర‌లో ఆ భాగాన్ని పూర్తి చేస్తాన‌ని కోర్టుకు తెలిపాడు. ఇప్పుడు నిర్మాత‌లే ముందుకు రావాలి. ఈ సినిమాకి ప్ర‌ధాన మైన స‌మస్య బ‌డ్జెట్. ఆ సినిమాకి అనుకున్న బ‌డ్జెట్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు నిర్మాత‌లు ఒక్క రూపాయి కూడా ఈ సినిమాపై ఖ‌ర్చు పెట్ట‌డానికి సిద్ధంగా లేరు. ముందు అనుకున్న ఎగ్రిమెంట్ ప్ర‌కారం… ఈ సినిమాని పూర్తి చేసే బాధ్య‌త ద‌ర్శ‌కుడిదే అన్న‌ది వాళ్ల వాద‌న‌. దీనిపైనే కోర్టు త‌న త‌దుప‌రి తీర్పు చెప్ప‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close