ఆచార్య వాయిదా.. ఆ క‌థే వేరు!

అనుకున్న‌ట్టే ఆచార్య వాయిదా ప‌డింది. మే 13న రావాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఆగ‌స్టుకు వెళ్లిందంటున్నారు. అంటే.. మూడు నెల‌ల తేడా అన్న‌మాట‌. అంద‌రికీ తెలిసిన కార‌ణం… క‌రోనా. కానీ… లోపాయ‌కారీగా ఈ సినిమా వాయిదా ప‌డ‌డానికి చాలా కార‌ణాలే ఉన్న‌ట్టు భోగ‌ట్టా.

ఆచార్య‌కి సంబంధించిన సీజీ వ‌ర్క్ అవ్వ‌లేద‌న్న సంగ‌తి ఆమ‌ధ్య తెలుగు 360 బ‌య‌ట‌పెట్టింది. ఆ సీజీ వ‌ర్క్ అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందో, రాదో అనే టెన్ష‌న్ చిత్ర‌బృందాన్ని బాగా ఇబ్బంది పెట్టింది. అంతే కాదు.. చేయాల్సిన ప‌ని దినాలు ఇంకా చాలానే ఉన్న‌ట్టు టాక్‌. రాత్రీ ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి షూటింగ్ జ‌రిపితే గానీ, మే 13న `ఆచార్య‌`ని తీసుకురావ‌డం క‌ష్ట‌మ‌నుకున్నారు. అంతే కాదు.. కొన్ని స‌న్నివేశాల్ని రీషూట్ చేయాల్సిన అవ‌స‌రం కూడా వచ్చింద‌ని టాక్. కరోనా అని కాదు గానీ, ఈ స‌మ‌స్య లేక‌పోయినా.. ఆచార్య రిలీజ్ డేట్ వాయిదా ప‌డేదే.. అన్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్. ఇప్పుడు కరోనాని ఓ సాకుగా చూపించే అవ‌కాశం అయితే ద‌క్కింది. పెద్ద సినిమాల‌తో వ‌చ్చే పేచీనే ఇది. ఏదీ అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌దు. మ‌ధ్య‌లో లెక్క‌లు మారుతూ ఉంటాయి. ఆచార్య విష‌యంలోనూ అదే జ‌రిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close