హైకోర్టు కంఠశోషే కానీ ప్రభుత్వం పట్టించుకోదా..!?

కేంద్ర ఎన్నికల సంఘం మీద మద్రాస్ హైకోర్టు ఎలా విరుచుకుపడింతో.. తెలంగాణ ఎస్‌ఈసీ మీద.. తెలంగాణ హైకోర్టు అదే రేంజ్‌లో విరుచుకుపడింది. ఆకాశంలో ఉన్నారా.. భూమి మీద ఉన్నారా అని సూటిగా ప్రశ్నించింది. దీనికి కారణం.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తూండటమే. కరోనా కేసులు తెలంగాణలో పెరిగిపోతూండటం… పెద్దగా ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో పట్టుదలగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా… పరిస్థితులు బాగోలేవని తెలిసినా ఎన్నికలకే మొగ్గు చూపింది. చివరికి గవర్నర్ జోక్యం చేసుకుని ఎస్‌ఈసీతో మాట్లాడినా ఎన్నికల వాయిదాకు సుముఖత చూపలేదు. ముఫ్పయ్యో తేదీన పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో … ఒక్క రోజు ముందుగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై మండిపడింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తంచేసింది. ప్రభుత్వం పెట్టమంటేనే పెడుతున్నామంటూ..ఎస్‌ఈసీ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలను తెలంగాణ హైకోర్టు కూడా ఎస్‌ఈసీపై చేసింది. ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని సూటిగా ప్రశ్నించింది. అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

ప్రభుత్వంపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగుస్తుంది.. తర్వాత ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించడంతో ప్రభుత్వ లాయర్లు నీళ్లు నమలాల్సి వచ్చింది. నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకని.. ఒక రోజు ముందు కట్టడి చర్యలు ప్రకటిస్తే నష్టమేంటని ప్రశ్నించింది. హైకోర్టు కరోనా విషయంలో తెలంగాణ సర్కార్‌ను ఎప్పటికప్పుడు నిలదీస్తోంది.కానీ.. ప్రభుత్వం మాత్రం.. నింపాదిగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వంతో పాటు.. ఎస్ఈసీ కూడా.. ఇరుక్కుపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close