గుండెపోటు కాదు… క‌రోనానే!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కెవి ఆనంద్ మ‌ర‌ణ‌వార్త‌… చిత్ర‌సీమ‌ని క‌ల‌చి వేస్తోంది. ప్ర‌తిభావంతుడైన కెమెరామెన్‌, ద‌ర్శ‌కుడ్ని కోల్పోవ‌డం – తీర‌ని లోటు. అయితే… కెవి ఆనంద్ చనిపోయింది గుండెపోటుతో కాద‌ట‌. క‌రోనాతో. ఈ విష‌యాన్ని చెన్నై ఆసుప‌త్రి వ‌ర్గాలు ధృవీక‌రిస్తున్నాయి. కొన్ని రోజుల క్రింద‌ట కెవి ఆనంద్ బంధువుకు క‌రోనా సోకింది. త‌ద్వారా కెవి ఆనంద్‌కి కూడా క‌రోనా పాజిటీవ్ అని తేలింది. శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు రావ‌డంతో ఆయ‌న ఆసుప‌త్రిలో చేరారు. చివ‌రికి ఈ తెల్ల‌వారుఝామున 3 గంట‌ల‌కు క‌న్నుమూశారు. అంతా హార్ట్ ఎటాక్‌తోనే అనుకున్నారు. అయితే మృత‌దేహాన్ని ఇవ్వ‌డానికి ఆసుప‌త్రి వ‌ర్గాలు నిరాక‌రించాయి. కోవిడ్ నిబంధ‌న‌ల దృష్ట్యా మృత‌దేహాన్ని ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చేశారు. ఆఖ‌రికి ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు సూర్య రంగంలోకి దిగి, ఆసుప‌త్రి వ‌ర్గాల‌తో మంత‌నాలు జ‌రిపినా… కుద‌ర్లేదు. మొత్తానికి ఆనంద్ మృతి వెనుక క‌రోనా ఉంద‌ని తెలిశాక‌… ఆయ‌న అభిమానుల హృద‌యాలు మ‌రింత బ‌రువెక్కుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...
video

టీజర్ రివ్యూ : ఇస్మార్ట్ డబుల్ మాస్

https://youtu.be/tq2HmozH_5Y?si=7YJ-IcGKWvYsaRDj రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్‌ సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్'తో అలరించబోతున్నారు. రామ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదల చేశారు. ల్యాబ్‌లో ఉన్న...

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close