“వ్యాక్సిన్ ఆర్డర్ల”పై ఎవరి వాదన నిజం..!?

రూ. పదహారు వందల కోట్ల ఖర్చు పెడితే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని.. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రజల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు ప్రభుత్వం అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. వ్యాక్సిన్ విధానం పూర్తిగా కేంద్రం వద్ద ఉంది. కేంద్రం ఎంత చెబితే.. అంత కొనుగోలు చేయాలి తప్ప.. ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేయడాని కి లేదని చంద్రబాబుకు తెలీదా అని ప్రెస్‌మీట్లు పెట్టి మరీ.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ వెంటనే కౌంటర్ ఇస్తోంది.

వ్యాక్సిన్ కంపెనీల వద్ద యాబై శాతం కేంద్రం తీసుకుంటుందని.. మిగతా యాభై శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని.. అనేక రాష్ట్రాలు ఆర్డర్లు పెట్టుకుని కొనుగోలు చేస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆర్డర్లు పెట్టిన రాష్ట్రాలకు టీకాలు ఇస్తున్నారని.. అదే సమయంలో.. ఏపీ సర్కార్ లేఖలు మాత్రమే రాసిందని.. ఆర్డర్లు పెట్టలేదని అంటోంది. అయితే ఈ వాదనను..ప్రభుత్వం తోసి పుచ్చింది. రాష్ట్రాలకు ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలో మొత్తంగా కేంద్రమే నిర్ణయిస్తోందని వాదిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ వ్యాక్సిన్ వివాదం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. అధికార పార్టీ అసహనానికి గురై.. కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోంది.

చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై దేశద్రోహం కేసులు పెట్టాలని మండిపడ్డారు. బహుశా.. ఏపీ హోంశాఖ ఆయన కనుసన్నల్లోనే ఉందని ప్రచారం జరుగుతున్నందున.. రేపో మాపో… ప్రతిపక్ష నేతలపై.. దేశద్రోహం కేసులు పెట్టినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీకాల వెనుక రాజకీయం చాలా జరుగుతోంది కానీ.. అసలు.. టీకాల విధానంలో ఎవరు చెబుతోంది నిజం అన్నది మాత్రం.. బయటకు రానీయడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close