రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో పది..పన్నెండు గంటల పాటు పరీక్షలు జరిపిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచ్ బృందం.. రఘురామరాజుకు కొట్టినట్లుగా గాయాలు లేవని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను న్యాయమూర్తి కోర్టులో చదివి వినిపించారు. రఘురామకృష్ణరాజు కాళ్లు వాచి ఉన్నాయని.. రంగు మారి ఉన్నాయని… వైద్యులు నివేదికలో తెలిపారు. ఎందుకు రంగు మారాయన్నది వైద్యులు చెప్పలేదు కానీ.. అవి కొట్టినందుకు వచ్చాయని మాత్రం చెప్పలేమని నివేదికలో చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంలో రఘురామకృష్ణరాజు న్యాయవాదులు.. సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను … సీఐడీ అధికారులు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది వద్ద సమాధానం లేకపోయింది. వాదనల తర్వాత హైకోర్టు.. సీఐడీ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే విచారణ సమయంలో.. రమేష్ ఆస్పత్రికి తరలించడానికి అదనపు అడ్వకేట్ జనరల్ అంగీకరించలేదు. రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసులుఉన్నాయని.. ఆ ఆస్పత్రి నిర్లక్ష్యంతో పది మంది చనిపోయారని వాదించారు. అంతే కాదు.. రమేష్ ఆస్పత్రికి తీసుకెళ్తే టీడీపీ ఆఫీస్‌కు తీసుకెళ్లినట్లేనని చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు మాత్రం విడిగా పిటిషన్ వేసుకోవాలని సూచించింది. కింది కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

నిజానికి సీఐడీ అధికారులు రఘురామరాజుకు ఇతర చోట్ల వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా లేరు. ముందుగా సీఐడీ కోర్టు ఆదేశాల ప్రకారం జీజీహెచ్‌లో తర్వాత రమేష్ ఆస్పత్రిలోనూ పరీక్షలు చేయించాల్సి ఉంది. రమేష్ ఆస్పత్రిలో టెస్టులు చేస్తే.. భిన్నమైన ఫలితాలు వస్తాయని అనుకున్నారో… లేక గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఇచ్చే నివేదిక చాలని అనుకున్నారో కానీ..టెస్టులను అంతటితో నిలిపివేశారు. అయితే ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ అధికారులు అమలు చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close