ఏపీ సర్కార్‌పై రివర్స్ కేసులు పెడుతున్న ఆంధ్రజ్యోతి..!

మీడియాపై కేసులు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “సుప్రీంకోర్టు ధిక్కరణ”కు పాల్పడిందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్ దాఖలు చేసింది. కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ.. రఘురామకృష్ణరాజు మాట్లాడిన ప్రెస్‌మీట్‌ను ప్రత్యక్షంగా ప్రసారం చేసినందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజద్రోహం కేసు నమోదు చేసింది. ఇలాంటి కేసులు నమోదు చేయడం పూర్తిగా సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వ తేదీన ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్‌లో పేర్కొంది.

కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చెప్పడం.. షేర్ చేయడం… అలాగే పౌరులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వెల్లడించడం ఏ మాత్రం తప్పు కాదని.. అలా చేయడం నేరం కాదని.. సుప్రీంకోర్టు ఏప్రిల్ 30వతేదీన ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది. ఎవరైనా తప్పుడు సమాచారం అని కేసులు పెడితే.. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మానసం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆ తీర్పును ఉల్లంఘిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా తన ప్రెస్‌మీట్లలో కరోనా అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తన అభిప్రాయాలు చెప్పారు. వాటిని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ చానల్‌పై కేసు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టి… ప్రజా గొంతుకను వినిపించకుండా చేయాలన్న కుట్రతో… పోలీసు అధికారులను ప్రయోగిస్తున్నారని.. మీడియా ప్రసారాలను చట్ట విరుద్ధంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఏబీఎన్ పిటిషన్‌లో స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందున కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తున్నామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తన పిటిషన్‌లో తెలిపింది. ఈ పిటిషన్‌లో చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతంసవాంగ్‌లతో పాటు సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌లను ప్రతివాదాలుగా చేర్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close