దుబాయ్‌లోనే మిగిలిన ఐపీఎల్..!

ఐపీఎల్ మళ్లీ దుబాయ్‌కే చేరింది. మధ్యలో అగిపోయిన ఐపీఎల్‌ను దుబాయ్‌లో కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ పందొమ్మిదో తేదీ నుంచి అక్కడ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇంగ్లాండ్‌తో పాటు శ్రీలంక కూడా మిగిలిన ఐపీఎల్ నిర్వహణకు తమ అంగీకారం తెలిపినా అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుందని దుబాయ్‌నే బీసీసీఐ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 60 మ్యాచ్‌లకు గాను 29 మాత్రమే పూర్తయ్యాయి. ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత ఐపీఎల్, ప్రపంచకప్‌ కోసం టీమ్ఇండియా నేరుగా యూఏఈ చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

కరోనా కారణంగా సగం సీజన్‌ ముగిసిన తర్వాత ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడింది. ముంబయి, చెన్నై వేదికలు సవ్యంగానే సాగాయి. ఢిల్లీ, అహ్మదాబాద్‌కు వేదికలు మార్చిన తర్వాత.. ప్రయాణాలు, ఇతర కారణాల వల్ల ఆటగాళ్లకు వైరస్‌ సోకింది. కోల్‌కతాలో వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌, హైదరాబాద్‌లో వృద్ధిమాన్‌ సాహా, దిల్లీలో అమిత్‌ మిశ్రా, చెన్నైలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌లు మైక్‌ హస్సీ, లక్ష్మీపతి బాలాజీకి పాజిటివ్‌ వచ్చింది. దాంతో సీజన్‌ను వాయిదా వేయక తప్పలేదు. రెండున్నర వేల కోట్ల నష్టం తేలడంతో ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించి ఆ మేరకు సక్సెస్ అవుతోంది.

గత ఏడాది ఐపీఎల్ కూడా.. గల్ఫ్ లోనే జరిగింది. అప్పుడు కూడా కరోనా కేసులే కారణం. ఇప్పుడు కరోనా వల్ల సమస్యలేదనుకుని టోర్నీని ప్రారంభిస్తే.. సగం జరిగేసరికి మొత్తం తేడా వచ్చేసింది. చివరికి దుబాయ్‌కే చేరింది. ఆటగాళ్లందర్నీ.. నిబంధనల ప్రకారం.. క్వారంటైన్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇతర టీముల షెడ్యూల్‌తో కూడా క్లాష్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కొంత మంది స్టార్ ప్లేయర్లు మిస్ అవుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆశీష్… గెట్ రెడీ ఫ‌ర్ యాసిడ్ టెస్ట్!

వెనుక ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, ఒక‌టి రెండు సినిమాల వ‌ర‌కే! ఆ త‌ర‌వాత ఎవ‌రి కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డాల్సిందే, నిరూపించుకోవాల్సిందే. ఆ త‌రుణం.. ఇప్పుడు ఆశీష్‌కి వ‌చ్చేసింది....

వైసీపీ రిగ్గింగ్ ఆర్తనాదాలు – టీడీపీ హ్యాపీ !

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా ఆర్తనాదాలు చేస్తూంటే.. ప్రత్యర్తి పార్టీకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. వైసీపీ ఎంజాయ్ చేసింది. ఈ సారి రివర్స్ అయింది. వైసీపీ...

హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో అత్యవసర పిటిషన్ ను దాఖలు చేశారు. ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్...

అతిగా ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకున్న కొడాలి నాని

కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్క సారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. ఏమయిందోనని పార్టీ నేతలు కంగారు పడ్డారు. వెంటనే వచ్ిచ టెస్టు చేసిన వైద్యులు అతిగా ఆలోచించడంతో ఆరోగ్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close