జగనా..? మోడీనా? పరీక్షలపై ఎవరి విధానం గొప్పది..?

కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి .. అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటన్నింటిపై సమీక్షించి.. పరీక్షల రద్దుకే ప్రాధాన్యం ఇచ్చారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తంచేశారు. పరీక్షలు రాయాలనుకునేవారికి కరోనా ఉధృతి తగ్గాక గత ఏడాదిలానే నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి పరీక్షల నిర్వహణకే మెజారిటీ రాష్ట్రాలు మొగ్గు చూపాయి. మహారాష్ట్ర సర్కార్ రద్దు చేయాలనగా.. వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత పెట్టాలని కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు కోరారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. మోడీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. టెన్త్ క్లాస్ పరీక్షలను సీబీఎస్‌ఈ కూడా ఎప్పుడో రద్దు చేసింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా జీపీఎలు ప్రకటించబోతోంది.

అయితే ఏపీ సర్కార్ మాత్రం ఇంత వరకూ టెన్త్ పరీక్షలు కూడా రద్దు చేయలేదు. ఆరు నూరైనా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించేసింది. మరో వైపు జూన్ చివరి వరకూ సెలవులు ప్రకటించేసింది. అంటే.. జరిగితే.. జూలైలోనే. పరీక్షలు నిర్వహించి.. ఫలితాలు ప్రకటించేసరికి జూలై పూర్తి అయిపోతుంది. అంటే ఆగస్టు వస్తుంది. పదో తరగతి పరీక్షలపై ఇతర రాష్ట్రాలు,కేంద్రం కూడా తేల్చేశాయి.పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా జీపీఏలు ప్రకటించేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇంటర్ ఆన్ లైన్ క్లాసులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారంలో తెలంగాణ ఇంటర్ అకడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.

పరీక్షలు రాయకపోతే విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలంటూ ఏపీ సర్కార్ వాదనలు వినిపిస్తోంది. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని విద్యారంగ నిపుణుల సూచనలు చేస్తున్నారు. పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. టెన్త్ పరీక్షలు పెట్టకపోయినా విద్యార్థులకు భవిష్యత్‌లో పెద్దగా ఇబ్బంది ఉండదని.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముఖ్యమని.. కాస్త ఆలస్యమైనా పెట్టాలనే సూచనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ కూడా… విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తున్నారు. ధర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువగా విరుచుకుపడబోతోందన్న విశ్లేషణల మధ్య ఆయన చురుకైన నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏపీ సర్కార్ మాత్రం.. ఏదో తెలియని పట్టుదలతో ముందుకు పోతోంది. ఏం జరిగితే అది జరుగుతుంది.. తమకేమిటీ అన్న భావనలో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close