వ్యాక్సిన్ల తప్పు రాష్ట్రాలదేనని కేంద్రం లెక్కలు..!

బీజేపీయేతర రాష్ట్రాలన్నీ కేంద్ర వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని.. ఆరోపిస్తున్నాయి. ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. కలసికట్టుగా పోరాటం చేద్దామని.. పిలుపునిచ్చుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం.. ఆయా రాష్ట్రాలన్నీ.. వ్యాక్సిన్ విషయంలో ఎంత తేలికగా ఉన్నాయో చెబుతూ.. ఓ ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వివరాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో 65 లక్షల యాభై వేల వ్యాక్సిన్ డోసులు పంపారు. అయితే.. ఈ మూడు నెలల్లో ఏపీ సర్కార్ ప్రజలకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ కేవలం.. 26 లక్షల 10వేల డోసులు మాత్రమే.

అంటే.. దాదాపుగా నలభై లక్షల డోసులు ఏపీ సర్కార్.. నిల్వ చేసుకుంది. ఆ సమయంలో డోసుల వేస్టేజీ కూడా ఎక్కువగానే ఉంది. తెలంగాణ కూడా ఈ విషయంలో తక్కువేమీ చేయలేదు. తెలంగాణకు కేంద్రం 41 లక్షల 40వేల డోసులు పంపిస్తే.. మూడు నెలల్లో 13 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేశారు. రెండు లక్షల ఇరవై ఐదు వేల డోసులు వృధా చేశారని.. కేంద్రం తన ఫ్యాక్ట్ షీట్‌లో వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు..బీజేపీయేతర రాష్ట్రాలన్నీ.. అంతేనని కేంద్రం ఆరోపిస్తోంది. పంపిణీ చేసిన వ్యాక్సిన్లలో సగం కూడా వాడలేదని అంటోంది. కేంద్రం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్‌లో బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రమే ఉన్న రాష్ట్రాల గురించి ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత చురుగ్గా వ్యాక్సినేషన్ నిర్వహించాయో.. ఫ్యాక్ట్ షీట్‌లో కేంద్రం వివరాలు బయటపెట్టలేదు.

నిజానికి కేంద్రం చాలా వివరాలు దాచి పెట్టిందని.. రాష్ట్రాలు మండిపడే అవకాశాలుఉన్నాయి. ఎందుకంటే.. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాతనే వ్యాక్సినేషన్ ఊపందుకుంది. అప్పటి వరకూ ప్రజలు.. ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. వ్యాక్సిన్‌పై వ్యతిరేక ప్రచారం జరగడంతో.. చాలా మంది మిన్నకుండిపోయారు. ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయలేదు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత అంటే.. ఏప్రిల్, మే నెలలో వ్యాక్సిన్ అవసరం విపరీతంగా పెరిగింది. కానీ కేంద్రం ఈ రెండు నెలల గురించిన సమాచారాన్ని చెప్పలేదు. మార్చి వరకూ చెప్పి.. తప్పు అంతా రాష్ట్రాలదేనని ఫ్యాక్ట్ షీట్ పేరుతో ఆరోపించడం ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close