ఏపీ ఉద్యోగ సంఘాల్లో అలజడి షురూ..!

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు.. తమ సంక్షేమం తాము చూసుకుంటున్నారు కానీ ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోవడం లేదు. నోరు తెరిస్తే చర్యలని బెదిరింపులు మిగతా వారిని నోరు తెరవనివ్వడం లేదు. కానీ ఎంత కాలం ఇలా నోరు మూసి ఉంచారు. ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. సంఘం నేతలపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డిపై ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయనకు నేరుగా లేఖలు రాస్తున్నారు. వాటిని వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు. అవి అందరికీ తెలిసిపోతున్నాయి. సచివాలయ ఉద్యోగసంఘంలో గతంలో కీలకంగా పని చేసిన రామారావు అనే ఉద్యోగి రాసిన లేఖ ఇప్పుడు హైలెట్ అవుతోంది.

వెంకట్రామిరెడ్డి ఎప్పుడూ ఉద్యోగుల కోసం మాట్లాడిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి మద్దతివ్వడం సామాజిక బాధ్యత అని ఆయన రెచ్చిపోతూ ఉంటారు. సచివాలయంలో ఉద్యోగులు కరోనాతో చనిపోతే.. వారికి రావాల్సిన బెనిఫిట్స్… కారుణ్య నియామకాల కింద పిల్లలకు చాన్స్ ఇప్పించేందుకు వెంకట్రామిరెడ్డి కనీస ప్రయత్నం చేయలేదు. నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు పెడతానన్నప్పుడు.. ఉద్యోగుల తరపున తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించిన వెంకట్రామిరెడ్డి అప్పట్లో అందరికీ వ్యాక్సిన్ వేయించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక… ఆయన ఆ దిశగా ప్రభుత్వంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

వెంకట్రామిరెడ్డి వ్యక్తిగతంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి విభిన్న మార్గాల్లో లబ్ది పొందుతున్నారన్న ఆరోపణలు ఉద్యోగ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంో ఆయన ఉద్యోగుల గురించి కాకుండా ఇతర సంఘాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ప్రభుత్వాధినేతల చేతుల్లో పావుగా మారాడని అంటున్నారు. ఆయనపై ఇప్పటికే మరో ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఉద్యోగుల ఆగ్రహం మెల్లగా పైకి వస్తూండటంతో ఉద్యోగ సంఘాల నేతలు… పీఆర్సీ గురించి… కరోనా కష్టాల గురించి… ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడటం ప్రారంభించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రకటనలు ఇస్తున్నారు. మరికొన్ని రోజులు పోతే.. ఉద్యోగుల తిరుగుబాటు తప్పకపోవచ్చన్న అంచనాతో ఉద్యోగ సంఘాలు… ప్రభుత్వానికి ఎదురుతిరిగే రోజు రావొచ్చని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close