ఏపీ గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచారా..!?

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను కేంద్రం ఢిల్లీకి పిలిపించిందని… కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కాని దానికి సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. ఢిల్లీ నుంచి కూడా ఏపీ గవర్నర్‌ను పిలిచినట్లుగా సంకేతాలు రాలేదు. దీంతో గవర్నర్‌ను ఢిల్లీ పర్యటన అన్నది ఊహాగానమేనని చెబుతున్నారు. సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ పూర్తయిన తర్వాత… కాసేపటికే ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు. అసలు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. ఎందుకు సీఎం జగన్ వివరణ ఇవ్వగానే ఆమోద ముద్ర వేశారన్నది సస్పెన్స్‌గానే మారింది. ఆ సమయంలోనే గవర్నర్‌ను ఢిల్లీకి పిలిచారనే ప్రచారం ప్రారంభమయింది.

సాధారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక బీజేపీ రాజకీయంగా పోరాటం చేయాలనుకున్న రాష్ట్రాల్లో అయితే.. తామే ముఖ్యమంత్రులం అన్నట్లుగా గవర్నర్లు.. లెఫ్ట్ నెంట్ గవర్నర్లు వ్యవహరిస్తూ ఉంటారు. బెంగాల్ , ఢిల్లీల్లో అదే జరిగుతోంది. అయితే.. బీజేపీతో సన్నిహిత సంబంధాలు నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాలతో పాటు… ఇతర చోట్ల గవర్నర్లు కాస్త సైలెంట్ గా ఉంటారు. అయితే సైలెంట్‌గా ఉండటం వేరు.. ప్రభుత్వం ఏం చేసినా..సహకరించడం వేరు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్… రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల ఉల్లంఘిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ఆమోద ముద్ర వేస్తున్నారు. తరవాత కోర్టుల్లో కొట్టి వేసినా దులిపేసుకుంటున్నారు.

ఈ క్రమంలో బిశ్వభూషణ..బీజేపీ నేతల ఆదేశాల కన్నా.. ఎక్కువగా ఏపీ ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగానే పని చేస్తున్నారన్న అభిప్రాయం.. బలపడింది. ఆయనపై.. ఏపీ బీజేపీ నేతలు.. హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీకి పిలుపంటే.. ఆయనకు క్లాస్ పీకడమో..లేకపోతే.. కొత్త వారిని నియమించే ప్రక్రియకు గ్రౌండ్ వర్క్ చేయడమో అని అనుకున్నారు. కానీ అధికారికంగా ఆయన ఢిల్లీ పర్యటన మాత్రం ఇంత వరకూ ఖరారు కాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గం గం.. గణేశా’ రివ్యూ: కొన్ని తుంటరి నవ్వులు

Gam Gam Ganesha Movie Telugu Review తెలుగు360 రేటింగ్ 2.5/5 -అన్వ‌ర్‌ ఆనంద్‌ దేవరకొండకు 'బేబీ' రూపంలో ఓ బాక్సాఫీస్‌ హిట్ పడింది. ఆ సినిమా యూత్ లో బాగా వైరల్ కావడంతో మంచి ఫాలోయింగ్...

బీఎల్‌ సంతోష్ జోలికి వెళ్లకపోతే కేసీఆర్ కథ వేరేగా ఉండేదేమో ?

బీఆర్ఎస్ ఇన్ని కష్టాలకు.. కేసీఆర్ కుటుంబానికి మనశ్శాంతి లేకపోవడానికి కేసీఆర్ అహంకార పూరితంగా తీసుకున్న నిర్ణయాలే కారణమన్న అసంతృప్తి ఆ పార్టీలో అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుత దుస్థితికి అసలు కారణం...

ఉత్కంఠకు తెర… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండనున్నాయి..?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ఫలితాలను ప్రతిబింబించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ...

రైతు రుణమాఫీ … రేవంత్ సర్కార్ కు చిక్కులు..!!

రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ కు కొత్త చిక్కులు ఎదురు అవుతున్నట్లుగా తెలుస్తోంది. రుణమాఫీ కోసం అవసరమైన 30వేల కోట్లను ఒకేసారి రాబట్టుకోవడం ప్రభుత్వానికి అంత సులభతరం కాదని అధికార...

HOT NEWS

css.php
[X] Close
[X] Close