కొత్త కోణం: క‌థ‌లు రాస్తున్న హీరోలు

క‌థ‌ల కొర‌త తీర్చ‌డానికి హీరోలు న‌డుం క‌ట్టారు. కాస్తో.. కూస్తో.. సృజ‌న‌, అనుభ‌వం ఉన్న క‌థానాయ‌కులంతా.. క‌థ‌ల విష‌యంలో దర్శ‌కుల‌కు స‌హాయం చేసి ప‌నిభారం తగిస్తున్నారు. క‌థా ర‌చ‌న‌, స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న వాళ్లైతే.. ఏకంగా క‌థే రాసేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లోని కొంత‌మంది హీరోలు.. క‌థ‌లు రాస్తున్న వైనం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

నాని స‌హాయ ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణం ప్రారంభించాడు. ద‌ర్శ‌క‌త్వం వైపు గురి ఉన్నా – ఇప్ప‌ట్లో ఆ దిశ‌గా అడుగులేయ‌డానికి రెడీగా లేడు. కానీ నిర్మాత‌గా మాత్రం బిజీనే. యేడాదికి క‌నీసం ఒక సినిమా తీయాల‌ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్ర‌స్తుతం `మీట్ – క్యూట్` అనే సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మ‌రోవైపు నాని ఓ క‌థ రెడీ చేశాడ‌ట‌. త‌న బ్యాన‌ర్‌లో రూపొందించే త‌దుప‌రి సినిమాకి.. త‌నే క‌థ‌ని అందించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. త‌న క‌థ‌ని స‌రిగా డీల్ చేసే ద‌ర్శ‌కుడి కోసం నాని అన్వేష‌ణ ప్రారంభించాడ‌ని స‌మాచారం.

అల్ల‌రి న‌రేష్ కూడా స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసిన వాడే. త‌న‌క్కూడా మెగాఫోన్ ప‌ట్టాల‌ని ఆశ‌. అయితే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇప్పుడు న‌రేష్ ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. అది త‌న కోస‌మే. కాక‌పోతే.. డైరెక్ష‌న్ మాత్రం తాను చేయ‌డ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ క‌థ స్క్రిప్టు రూపంలో మారుతోంద‌ని, ఆ ప‌నులు ఓ కొలిక్కి వ‌చ్చాక‌… పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కొస్తాయ‌ని స‌మాచారం. త‌న సినిమాల‌కు అప్పుడ‌ప్పుడూ స్క్రీన్ ప్లే అందిస్తుంటారు మోహ‌న్ బాబు. త‌న తాజా చిత్రం `స‌న్ ఆఫ్ ఇండియా`కి కూడా మోహ‌న్ బాబు క‌థ‌, స్క్రీన్ ప్లే విష‌యాల్లో స‌హాయ స‌హ‌కారాలు అందించారు. టైటిల్ కార్డులో కూడా.. మోహ‌న్ బాబు పేరు చూడొచ్చు. ర‌వితేజ ద‌గ్గ‌ర కూడా కొన్ని క‌థ‌లు ఉన్నాయి. వాటిలోని ఓ క‌థ ఎంచుకుని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌న్న‌ది ర‌వితేజ ఆలోచ‌న‌. ఇలా హీరోల్లో కొంత‌మంది క‌థ‌ల్ని సిద్ధం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. లాక్ డౌన్ వీళ్ల‌కు ప‌రోక్షంగా స‌హాయం చేసింది. ఆ ఖాళీ స‌మ‌యం క‌థా ర‌చ‌న‌పై
దృష్టి పెట్టేలా చేసింది. మ‌రి.. క‌థ‌కులుగా వీళ్లంతా ఎలా రాణిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close