రూ.40వేల కోట్ల గోల్‌మాల్.. గవర్నర్‌కు పీఏసీ చైర్మన్ ఫిర్యాదు..!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఆదాయం, చేసిన అప్పులకు… చేసిన ఖర్చులకు పొంతన లేకుండా పోయింది. మొత్తంగా లెక్కల్లో రూ. 40వేల కోట్ల వరకూ తేడా వస్తోంది. ఈ విషయంపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అయిన పయ్యావుల కేశవ్ నేరుగా గవర్నర్‌కుఫిర్యాదు చేశారు. పీఏసీ చైర్మన్‌గా ప్రభుత్వ ఆదాయ వ్యయాలను పరిశీలించే బాధ్యత పయ్యావుల కేశవ్‌పై ఉంది. ఆయన ఇటీవల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ లావాదేవీల్లో రూ. 40వేల కోట్ల వరకూ తేడా ఉన్నట్లుగా గుర్తించారు.

ఇది చాలా సీరియస్ ఇష్యూ కావడంతో ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. రెండేళ్లలో ఆర్ధికశాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. 40 వేల కోట్ల ఆర్ధిక లావాదేవీల్లో అకౌంటింగ్ ప్రొసీజర్స్‌లో.. తప్పిదాలు జరిగాయని పయ్యావుల గవర్నర్‌కు ఆధారాలతో సహా ఇచ్చారు. రెండేళ్లకు సంబంధించిన ఆర్ధికశాఖ రికార్డులను స్పెషల్ ఆడిటింగ్ చేయించాలని గవర్నర్‌ను పీఏసీ చైర్మన్ హోదాలో పయ్యావుల కోరారు. పీఏసీ వ్యక్తం చేసిన సందేహాలపై ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శికి రాసిన లేఖను గవర్నర్‌కు పయ్యావుల ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా.. ఆర్ధిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని పయ్యావుల కోరుతున్నారు.

నిజానికి ఏపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్ని అప్పులు తెచ్చారు… ఎలా ఖర్చు పెట్టారన్న దానిపై పారదర్శకత లేదు. కేంద్రం అడిగినా కూడా వివరాలు పంపడంలేదు. అప్పుల లెక్కలు చెప్పాలని నాలుగేళ్ల వివరాలు పంపాలని కోరినా ఏపీ ప్రభుత్వం రెండేళ్లవి మాత్రమే పంపింది. గత రెండేళ్లవి పంపలేదు. చివరికి ప్రతీ ఏడాది విధిగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన కాగ్ రిపోర్టును కూడా ప్రవేశ పెట్టలేదు. ఈ తరుణంలో రూ. 40వేల కోట్ల నిధులకు లెక్కలు తెలియడం లేదని పీఏసీ చైర్మన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం సంచలనమేనని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close