అందరికీ ఒకే డౌట్..! కేసీఆర్ – జగన్ ఎందుకు మాట్లాడుకోరు..?

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంలో అందరికీ ఒకే పరిష్కార మార్గం కనిపిస్తోంది. సోదరి షర్మిల దగ్గర్నుంచి బీజేపీ,టీడీపీ నేతలు అందరూ ఒక్కటే అడుగుతున్నారు. దావత్‌లు చేసుకుని ఒకరి నోట్లో ఒకరు స్వీట్లు పెట్టుకున్నప్పుడు… ఇప్పుడు సమస్య వస్తే.. ఎందుకు మాట్లాడుకోరు..? అని. నిజమే కదా అని సామాన్యులకు కూడా సందేహం వస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ – వైసీపీ మధ్య బలమైన బంధం ఏర్పడింది. ఎంత బలమైన బంధం అంటే.. ఏపీలో ఏమైనాజరిగితే.. తెలంగాణలో ఫిర్యాదులు చేసి.. అక్కడ కేసులు పెట్టి.. హడావుడి చేయగలగినంత స్నేహం. ఓ రకంగా తెలంగాణ పోలీసుల్ని.. ఏపీలో రాజకీయంగా వాడుకునేందుకు కేసీఆర్ అవకాశం కల్పించారు.

నాటి దావత్‌ల ఆత్మీయత ఇప్పుడు పలకరింపులకూ కొరగావడం లేదా..?

ఆయన అంత సాయం చేశారు కాబట్టే సీఎం జగన్… విజయం సాధించగానే.. ప్రధానమంత్రి కంటే ముందుగా కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత రెండు ,మూడు సార్లు ప్రగతి భవన్‌కు వెళ్లి సమావేశం కూడా అయ్యారు. ఇప్పటికీ వారి మధ్య రాజకీయ స్నేహం ఉందని కొద్ద రోజుల కిందట.. రఘురామకృష్ణరాజును హైదరాబాద్ అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి హైదరాబాద్ పోలీసులు సహకరించిన వైనంతోనే తెలిసిపోతుందని అంచనాకు రావొచ్చు. అయితే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇటీవలి కాలంలో మళ్లీ ముఖాముఖి సమావేశం కాలేదు. కారణం ఏమిటో తెలియదు కానీ.. మొదటి విడత లాక్ డౌన్ సమయంలో… హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్న హాస్టల్ విద్యార్థుల్ని ఏపీ సర్కార్ సరిహద్దుల్లోనే నిలిపివేసింది. దీంతో తెలంగాణ సర్కార్ మళ్లీ హాస్టళ్లకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేదు.

ఉమ్మడి ప్రాజెక్ట్ ఆలోచన నుంచి జగన్ వెనక్కి తగ్గడం వల్లే సమస్యలా..?

అప్పటి నుండి రెండురాష్ట్రాల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా మాట్లాడుకోలేదు. చివరికి మొన్న అంబులెన్స్‌లను తెలంగాణ సర్కార్ నిలిపివేసినప్పుడు కూడా.. కేసీఆర్‌తో మాట్లాడటానికి జగన్ ఇష్టపడలేదు. ఇప్పుడుజల వివాదం వచ్చినా మాట్లాడటం లేదు. దీంతో ఇరువులు ముఖ్యమంత్రులు ముఖాముఖి మాట్లాడుకోవడానికి ఇష్టపడటం లేదన్న అభిప్రాయం మాత్రం అంతటా ఏర్పడుతుంది. గతంలో కేసీఆర్ ఆంధ్రా ప్రాజెక్టులను కూడా రీ డిజైనింగ్ చేశారు. ఉమ్మడి ప్రాజెక్ట్‌గా తెలంగాణ భూభాగంలో ఓ ప్రాజెక్టు కట్టాలని ఆలోచన చేశారు. ఒప్పందాలు చేసుకోవాలని జగన్ కూడా సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రకటించారు.

మాటల్లేకపోవడం.. రాజకీయమా..? వ్యూహమా..?

కానీ అది ట్రాప్ అని అనుకున్నారేమో కానీ.. జగన్ వెనక్కి తగ్గినట్లుగా ఉన్నారు. దీంతో కేసీఆర్‌కు ఆగ్రహం వచ్చిందేమో కానీ.. వ్యక్తిగతంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు చెడిపోయాయన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే అది రాజకీయమా.. లేక నిజమా.. మళ్లీ ఉమ్మడి శత్రువు వారిని ఏకం చేస్తుందా అన్నది భవిష్యత్‌లో తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే.. రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల మధ్య పలకరింపులు లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close