రివ్యూ: హీరో

రిష‌బ్ శెట్టికి క‌న్న‌డ‌లో మంచి మార్కెట్ ఉంది. త‌న క‌థ‌లు, సినిమాలు, పాత్ర‌లు… ఎటు చూసినా ఎక్క‌డో చోట కొత్తద‌నం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. `బెల్ బాట‌మ్‌`తో త‌న స్టైల్ ఏమిటో? తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా అర్థ‌మైంది. ఇప్పుడు `హీరో`గా వ‌చ్చాడు. క‌న్న‌డ‌లో ఈయేడాది మార్చిలో విడుద‌లైన ఈ సినిమాని అదే పేరుతో డ‌బ్ చేసి, `ఆహా`లో విడుద‌ల చేశారు.

హీరో ఓ బార్బ‌ర్‌. త‌ను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ.. ఆ అమ్మాయి మాత్రం హ్యాండిచ్చి మ‌రొక‌రిని పెళ్లి చేసుకుంటుంది. ఐదేళ్లయినా ఆమె పై ప్రేమ చావ‌క‌పోవ‌డంతో… ఏకంగా ప్రేమించిన అమ్మాయినే చంపేయాల‌నుకుంటాడు హీరో. త‌న‌ని వెదుక్కుంటూ ఇంటికి వెళ్తాడు. అయితే.. ఇంట్లో ఆల్రెడీ.. ఓ హ‌త్య జ‌రుగుతుంది. ఇంత‌కీ ఆ హ‌త్య ఎవ‌రు చేశారు? ఎందుకు చేశారు? అన్న‌దే క‌థ‌.

రెండు మూడు లైన్ల‌లో చ‌దువుతుంటే – ఇదో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అనుకుంటారు. సీరియ‌స్ గా సాగే సినిమా అనుకుంటారు. కానీ.. దాన్ని వీలైనంత లైట‌ర్ వేలో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు. హీరో.. హీరోయిన్‌ని వెదుక్కుంటూ ఎస్టేట్‌కి వెళ్ల‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. అయితే అస‌లైన డ్రామా ఆ ఎస్టేట్ లోనే మొద‌ల‌వుతుంది. క‌థ‌ని చాలా ఆస‌క్తిక‌రంగా ప్రారంభించాడు ద‌ర్శ‌కుడు. తొలి స‌న్నివేశాలు చూస్తే… క‌చ్చితంగా ఇది మ‌రో డిఫ‌రెంట్ సినిమా అనిపిస్తుంది. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ…. అదే ఫీలింగ్ క‌లుగుతుంది. శ‌వాన్ని ఇంట్లో ఉంచుకుని చేసే డ్రామా న‌చ్చుతుంది. ఆ ఇంట్లో కుక్క‌ర్ విజిల్ కోసం ఓ పాత్ర తెగ వెదికేస్తుంటుంది. దాని చుట్టూ న‌డిచే స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. ఇంట్ర‌వెల్ వ‌ర‌కూ ఎలాంటి కుదుపుల్లేకుండా సాగిన సినిమా.. ఆ త‌ర‌వాత పూర్తిగా డౌన్ ఫాల్ లో పడిపోతుంది. హంట్ బిగెన్ అంటూ.. ఇంట్ర‌వెల్ కార్డ్ ద‌గ్గ‌ర ఆస‌క్తి రేపిన ద‌ర్శ‌కుడు.. దాన్ని క‌డ‌వ‌ర‌కూ కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఎస్టేట్ చుట్టూ హీరో హీరోయిన్లు ప‌రుగులు పెట్ట‌డం, వాళ్ల‌ని విల‌న్ గ్యాంగ్ ప‌ట్టుకుని చిత్ర‌హింస‌ల‌కు గురి చేయ‌డం త‌ప్ప‌.. ద్వితీయార్థంలో ఏం ఉండ‌దు. చివ‌ర్లో ఏదో భ‌యంక‌ర‌మైన ట్విస్టు వ‌స్తుంద‌ని ఆశిస్తారంతా. అదేం లేకుండా.. చ‌ప్ప‌గా ముగించేశాడు ద‌ర్శ‌కుడు. దాంతో ఈ సినిమా ఎందుకు తీశాడు? అన్న ప్ర‌శ్న రేకెత్తుతుంది.

క‌న్న‌డ‌లో ఇది వ‌ర‌కు చాలా లో క్వాలిటీ సినిమలొచ్చేవి. కానీ వాళ్లు కూడా పంథా మార్చారు. భారీ బ‌డ్జెట్లు పెడుతున్నారు. `హీరో` చూస్తే… బ‌డ్జెట్ కొర‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. సినిమా అంతా దాదాపుగా ఒకే లొకేష‌న్ లో సాగుతుంది. టేకింగ్ అంత గొప్ప‌గా ఏం లేదు. “చిన్న‌ప్పుడు మ‌న మెమొరీ ప‌వ‌ర్ పెంచ‌డానికి హార్లిక్సూ.. బూస్టూ తాగించేవాళ్లు. దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలిసేది ప్రేమించిన అమ్మాయిని మ‌ర్చిపోలేక‌పోయిన‌ప్పుడు“ అనే డైలాగ్ బాగుంది. వీటితో పాటు కొన్ని ఫ‌న్నీ సంభాష‌ణ‌లు న‌చ్చుతాయి. సినిమా నిడివి త‌క్కువే. అయినా స‌రే.. అక్క‌డ‌క్క‌డ బోర్ కొడుతుంది. మొత్తానికి బాగా మొద‌లెట్టి, చ‌ప్ప‌గా ముగించిన సినిమాల జాబితాలో… `హీరో` చేరిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close