జగన్‌ కేసులో సీబీఐది భయమా..? మొహమాటమా..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెయిల్ పై ఉన్నారు. ఆయన బెయిల్ షరతులు ఉల్లఘించారు. ఇవిగో ఆధారాలు అంటూ దాఖలైన పిటిషన్‌పై సీబీఐ తన అభిప్రాయం చెప్పడానికి నెలల తరబడి సమయం తీసుకుంది. చెబుతానంటది.. చెప్పనంటది. ఓ సారి రాత పూర్వకంగా ఇస్తానటది.. మరోసారి ఇవ్వేలేమంటది. చివరికి.. తమ న్యాయవాదులకు జ్వరం వచ్చిందన్న సాకు కూడా చెప్పారు. మరోసారి వాదనలకు సమయం కావాలని కోరింది. దీంతో పిటిషన్ వేసిన రఘురామ తరపు న్యాయవాదులకే కాదు… కోర్టుకు కూడా చిరాకేసింది. చివరికి సీబీఐ.. మేం వాదనలు వినిపించబోమని చెప్పాల్సి వచ్చింది. దీంతో సీబీఐ మినహా. .. జగన్, రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కౌంటర్ల ఆధారంగా సీబీఐ వచ్చే నెల 25వ తేదీన బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది.

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై అభిప్రాయం చెబితే సీబీఐకి వచ్చే నష్టమేంటి..?

సీబీఐ అంటే.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అంత చేటు సీబీఐకి.. ఒక్క బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇన్ని రకాల మాట మార్పులు ఎందుకో.. సామాన్య జనానికి అర్థం కాదు. అసలు ఈ పిటిషన్‌పై జగన్ కంటే ఎక్కువగా.,. సీబీఐనే కంగారు పడింది. తాను చెప్పాలనుకున్నది రెండు, మూడువాయిదాలు కోరినా జగన్ చెప్పేశారు. కానీ సీబీఐ మాత్రం… వాయిదాల మీద వాయిదాలు కోరుతూనే వస్తోంది. కావాలనే సీబీఐ ఈ వాయిదాలు కోరుతుందని సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది. మే ప్రారంభంలో మొదటగా విచారణ జరిగినప్పుడు… కరోనా సాకు చెప్పి.. మూడు సార్లు సీబీఐ కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. రెండు సార్లు ఇదే చివరి చాన్స్ అని హెచ్చరించిన తర్వాత…మూడు అంటే మూడు లైన్ల కౌంటర్ దాఖలు చేసింది. ఆ మూడు లైన్లలో ఉన్న సమాచారం… తాము ఎలాంటి వాదనలు వినిపించబోమని.. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చెప్పడం.

వాయిదాల కోరి కాలయాపనచేసి ఎవరికి మేలు చేయాలనుకున్నారు..?

మూడు వాయిదాలు కోరి మూడు లైన్ల కౌంటర్ దాఖలు చేయడంపై.. సీబీఐపై చాలా మంది అనుమానపు చూపులు చూశారు. అయితే ఆమాటకే కట్టుబడి ఉంటే… సరే .. సీబీఐ ఇబ్బందులు సీబీఐకి ఉన్నాయని అనుకునేవారు. కానీ తర్వాత గేమ్ ప్రారంభించింది. ఓ సారి రాత పూర్వక వాదనలు వినిపిస్తామని వాయిదా కోరుతుంది. తర్వాత సమర్పించబోమని చెబుతుంది. మళ్లీ విచారణలో మళ్లీ రాతపూర్వక వాదనలు వినిపిస్తామంటుంది. మళ్లీ విచారణలో లాయర్లకు జ్వరం వచ్చిందని సిల్లీ రీజన్స్ చెబుతూంటారు. ఇంకా ఇంకా కారణాలు చెబుతూ.. ఎన్ని సార్లు వీలైతే.. అన్ని సార్లు వాయిదా వేయంచడానికి సీబీఐ ప్రయత్నించింది. చివరికి రఘురామ తరపు లాయర్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో… కోర్టు కూడా మరోసారి సమయం ఇవ్వడానికి నిరాకరించింది. సమయం ఇచ్చినా.. వచ్చే విచారణలో మరో కారణమే చెబుతారు కానీ.. కౌంటర్ కాదని నిర్ణయించుకున్నారు. దీంతో.. తాము వాదనలు వినిపించబోమని ఫైనల్‌గా సీబీఐ చెప్పేసినట్లయింది.

కొత్త సీబీఐ చీఫ్ వచ్చినా పరిస్థితిలో మార్పు లేదా..?

సాధారణంగా నిందితుల విషయంలో సీబీఐ కఠినంగా వ్యవహరించాలి. అదే చేస్తుంది. బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లుగా కనిపిస్తే స్వయంగాతామే పిటిషన్ వేయాలి. కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్‌లో ఉంది. కనీసం.. నిందితునికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి కూడా సీబీఐకి మనసొప్పడంలేదు. దీంతో సీబీఐకి భయమా.. మొహమాటమా.. భయంతో కూడిన మొహమాటమా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పంజరంలో మారిన చిలుకగా సీబీఐ మారిందని.. పై నుంచి ఆర్డర్స్ వస్తే.. ఏం మాట్లాడమంటే అదే మాట్లాడుతుందని.. ప్రస్తుతం ఈ కేసు విషయంలో ఎలాంటి ఆర్డర్స్ రాలేదని అందుకే సైలెంట్‌గా ఉంటోందని ప్రజలు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సీబీఐ చీఫ్ వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close