జలాల వివాదాలు కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా..!?

తెలుగు రాష్ట్రాల మధ్య రగడకు కారణమైన జల వివాదాలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. విభజన చట్టం ప్రకారం తాము నోటిఫై చేసిన కృష్ణా, గోదావరి నదీ బోర్డులు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రెండు నదీ బోర్డులు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. 9వ తేదీన హైదరాబాద్‌లోని జలసౌధలో ఈ సమావేశం జరుగుతుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా.. ప్రభుత్వం పేర్కొన్న గెజిట్‌లోని అంశాలపై చర్చిస్తారు.

తెలంగాణ ప్రభుత్వం నదీ బోర్డులను నోటిఫై చేయడం.. అందులో అన్ని ప్రాజెక్టులను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ మాత్రం.. నోటిఫై చేయడాన్ని అంగీకరించినా… వాటిలో అన్ని ప్రాజెక్టులను చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో రెండు రోజుల కిందట కృష్ణాబోర్డు సమావేశానికి హాజరైనప్పటికీ… గెజిట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పైగా వాటిని తాము కేంద్రానికే చెబుతామని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల నడుమ… రెండు నదుల బోర్డులు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను గడువులోగా అమలయ్యేలా తేదీల వారీగా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర జల మంత్రిశ్వ శాఖ రెండు బోర్డుల ఛైర్మన్లను ఆదేశించింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు 11 మందితో.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 12 మందితో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశాయి.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇప్పుడు నదీ యాజమాన్య బోర్డులే కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. గతంలో బోర్డుల్ని నోటిఫై చేయకపోవడం వల్ల.. పరస్పర అంగీకారంతో కృష్ణాబోర్డు గత ఒప్పందాలను బట్టి నీటి పంపకాలు చేసేవారు. అయితే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఆ ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల బోర్డులను కేంద్రం నోటిఫై చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రాజెక్టులు మొత్తం బోర్డుల పరిధిలో ఉన్నాయి. గత ఒప్పందాల ప్రకారమే బోర్డులు నీటిని పంచుతాయి. అయితే ప్రతీ చిన్న విషయానికి ప్రాజెక్టుల విషయంలో బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. ఈ కారణఁగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ అంత అనుకూలంగా లేవు. తొమ్మిదో తేదీన సమావేశానికి రావాలని తెలంగాణకు కూడా సమాచారం పంపారు. అయితే హాజరయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు. దీంతో.. నదీ జలాల పరిష్కారానికి కేసీఆర్ సిద్ధంగా లేరన్న అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close