వైఎస్ వివేకా పోస్టుమార్టంపై సీబీఐ పోస్టుమార్టం..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సీబీఐ అధికారులకు పోస్టుమార్టం రిపోర్టులో అనేక అనుమానాలు బయట పడ్డారు. వాటిని నివృతి చేసుకోవడానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ను పిలిపించారు. అసలు ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టునే చూడనట్లుగా ఇప్పుడే దాని గురించి తెలిసినట్లుగా సీబీఐ అధికారులు హడావుడి చేయడం.. కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. వివేకా హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలకం. ఎందుకంటే ఆయనది మొదట గుండెపోటని ప్రచారం చేశారు. కానీ పోస్టుమార్టంతోనే హత్య అనివెలుగులోకి వచ్చింది.

వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ మామ అయి ఈసీ గంగిరెడ్డి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తర్వాత ఆస్పత్రి నుంచి నిపుణులు వచ్చి రక్తం తుడిచి.. గాయాలకు కుట్లు వేసి.. బ్యాండేజ్ చుట్టి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోస్టుమార్టం అవసరం లేదని వైద్యులకు, పోలీసులుకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె వైఎస్ సునీత పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయించారు. అప్పుడే వైఎస్ వివేకా మృతదేహానికి ఉన్న గాయాలన్నీ బయటపడ్డాయి. అప్పటి వరకూ గుండెపోటుగానే ప్రచారం జరిగింది.

పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అవన్నీ పదునైన ఆయుధంతో దాడి చేసినట్లుగా తేల్చడంతో హత్యగా నిర్ధారించారు. ఈ కారణంగా సీబీఐ అధికారులు పోస్టుమార్టం నివేదికపై ప్రత్యేకమైన పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత కాలం ఎందుకు పరిశీలించలేదో సీబీఐ అధికారులకే తెలియాలి. వైఎస్ వివేకా కేసులో ఆధారాలు ఇస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామంటూ పేపర్ ప్రకటన ఇచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. విజయవాడలో రాహుల్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు వారంలోచేధిస్తే.. సీబీఐకి ఏమయిందని ఇన్ని రోజులు టైం పాస్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close