మళ్లీ తెరపైకి ఏబీఎన్ ఆర్కే..!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మళ్లీ తనలోని జర్నలిస్టును బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకు ద్వారా మాత్రమే బయట ఉనికి చాటేవారు. అదేఆర్టికల్‌ను శనివారం సాయంత్రం టీవీలోనూ వీకెండ్ కామెంట్ బై ఆర్కే పేరుతో ప్రసారం చేసేవారు. ఆయనకు తీరిక లేనప్పుడు అది కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఆయన నేరుగా స్క్రీన్ పైకి రావాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమాన్ని నిర్వహించేవారు. అలాగే బిగ్ డిబేట్లు… ఓపెన్ డిబేట్లు నిర్వహించేవారు. ఇటీవలి కాలంలో అన్నీ మానేశారు. కానీ ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుని రెడీ అయిపోతున్నారు.

వచ్చే వారం నుంచి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పునం ప్రసారం కాబోతోంది. తొలి ఇంటర్యూ షర్మిలదే కావొచ్చని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం ఏబీఎన్ కార్యాలయంలో కొత్త స్టూడియో కూడా రెడీ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఆయన స్క్రీన్ మీదకు రావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ సారి ఓపెన్ హార్ట్ ప్రోగ్రాంతో మాత్రమే కాకుండా ప్రైమ్ టైమ్ డిబేట్లు కూడా నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం వారానికి ఓ రోజు బిగ్ డిబేట్.. ఆదివారం ఓపెన్ హార్ట్ ప్రైమ్ టైమ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఏబీఎన్‌లో ప్రైమ్ టైమ్ డిబేట్లు చేయడానికి వెంకటకృష్ణ ఉన్నారు. ఆయన స్థానంలో ఓ రోజు బిగ్ డిబేట్ పేరుతో రాధాకృష్ణనే చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏబీఎన్‌లో తొలి నాళ్లలో మంచి పేరు తీసుకు వచ్చిన ప్రోగ్రాం ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఆర్కే ఆడిగే ప్రశ్నలు మాస్ పల్స్ ను పట్టుకునేలా ఉండటంతో హాట్ టాపిక్ అయింది. ఎన్ని విమర్శలు వచ్చినా కావాల్సింది అదే కాబట్టి… వచ్చిన అతిధిని బట్టి ఆ స్థాయి ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు తన ఇంటర్యూ స్టైల్‌ని మారుస్తారో లేదో వేచి చూడాలి. రాధాకృష్ణ తెరపైకి రావడం ఆ చానల్‌కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close