దళిత బంధు ఆపేసిన క్రెడిట్ మీదంటే మీదే !

హుజురాబాద్ ఉపఎన్నికల కేంద్రంగా దళిత బంధు రాజకీయం మళ్లీ ప్రారంభమైంది. అనూహ్యంగా పోలింగ్‌కు పది రోజుల ముందు దళిత బంధు పథకాన్ని ఆపేయాలంటూ ఈసీ ఆదేశించింది. ఇది బీజేపీ కుట్రేనని టీఆర్ఎస్ అలా నోటీసులు రాగానే ఇలా ఆరోపణలు ప్రారంభించింది. ప్రేమేందర్ రెడ్డి అనే బీజేపీ నేత లేఖ రాశాడని కేటీఆర్ ఆరోపించారు. ఒక వారం ఆపుతారు.. ఆ తర్వాత ఆపగలరా అని ప్రశ్నించారు. వెంటనే బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

వారు బయట పెట్టిన లేఖ ఫేక్ అని ఎంపీ అర్వింద్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టి పోశారు. ఈటల రాజేందర్ కూడా ప్రచారంలో స్పందించారు. తాము దళిత బంధును అడ్డుకుంటున్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. దొంగ ఉత్తరాలు పుట్టిస్తున్నారని .. తాను లేఖ రాసినట్లుగా నిరూపించాలన్నారు. దళిత బంధును ప్రకటించి రెండున్నర నెలలు అవుతుదందని ఇప్పటి వరకూ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి చేత కాకనే పథకం ఆపేయించారన్నారు.

మరో వైపు బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితులపై కేసీఆర్‌కు ఏ మాత్రం పట్టింపు లేదన్నారు. ఎన్నికల కోడ్ కిందకు రాకుండా ఉండటానికే ముందు అమలు చేయడం ప్రారంభించారని ఇప్పుడు.. ఈసీ వద్దని లేఖ రాస్తే ఎందుకు ఊరుకున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మొత్తానికి అందరూ “క్రెడిట్‌”ను ఇతర పార్టీలకు అప్పగించడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ క్లెయిమ్ చేసుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close