ఆర్కే పలుకు : “ఆంధ్రా బూచి” చూపడానికే కేసీఆర్ కొత్త నాటకం !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో ఈ సారి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కన్నా కేసీఆర్‌ రాజకీయాన్ని విశ్లేషించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. హుజురాబాద్‌లో పోటీ జరిగింది ఈటల రాజేందర్‌కు – గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మధ్య కాదని .. కేసీఆర్‌కు ఈటలకు మధ్య అని కేసీఆర్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినా ఆయన రాజకీయం అంతమైపోయినట్లేనని విశ్లేషించారు. ఈ విషయంపై కేసీఆర్‌కు స్పష్టత ఉంది కాబట్టే.. మిత్రుడు జగన్‌తో కలిసి కొత్తగా సమైక్య రాష్ట్ర నినాదం ప్రారంభించారని అంటున్నారు.

సమయం, సందర్భం లేకుండా ప్లీనరీని పెట్టిన కేసీఆర్ అందులో ఆంధ్రాలో రాజకీయపార్టీ గురించి ప్రస్తావించారు. తనకు వేల ఫోన్లు వస్తున్నాయన్నారు. ఆంధ్రాలోని ఇతర సమస్యలను ఆయన ఎగతాళి చేసినా వాటిపై స్పందించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ..ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టడంపై మాత్రం స్పందించారు. తెలంగాణ, ఏపీని కలిపేస్తే బెటర్ అని చర్చ లేవనెత్తారు. వారు అలా మాటల తర్వాత తెలంగాణ రాజకీయం ప్రారంభమయింది. మళ్లీ ఆంధ్రోళ్ల కుట్రలంటూ టీఆర్ఎస్ అధికారిక మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి. ఇవే అంశాలను తన కొత్తపలుకులో వివరించిన ఆర్కే.. వ్యూహాత్మకంగానే ఇద్దరు మిత్రులు ప్రచారం ప్రారంభించేశారని చెప్పకనే చెప్పారు.

గత ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం వస్తుందన్న ప్రచారంతోనే ఎన్నికల్లో గెలిచి పీఠం అందుకున్న కేసీఆర్.. ఈ సారి కూడా తనపై ఉన్న అసంతృప్తిని ఆంధ్రోళ్ల పెత్తనం అనే కాన్సెప్ట్‌తో అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ పనిలో భాగంగానే ఇప్పుడు సమైక్య రాష్ట్రం అనే చర్చ ప్రారంభమయిందని ఆర్కే చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజం అని సామాన్యులు కూడా అనుకునే పరిస్థితి.

హుజురాబాద్‌లో ఉపఎన్నిక రావడం.. అటు ఈటల – ఇటు కేసీఆర్ ఇద్దరూ చేసుకున్న రాజకీయమేనని.. కానీ ఫలితం మాత్రం కేసీఆర్‌కు గుదిబండగా మారడం ఖాయమని చెబుతున్నారు. అంతే కాదు .. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాజకీయాల్ని ఖరీదు చేసేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు. మొత్తానికి ఈ వారం ఆర్టికల్‌లో సాగునీటి ప్రాజెక్టుల్ని మూలన పడేసి మరీ ..తమ తమ రాజకీయాల కోసం రాష్ట్రాలను సైతం ముఖ్యమంత్రులు భ్రష్టుపట్టిస్తున్నారని ఆర్కే తేల్చారు. వారి రాజకీయానికి ఏపీ ప్రజలు ఎలా పోయినా మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలు తేవడానికి ప్రయత్నిస్తున్నారని తేల్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు ఎవరివీ..? ఎందుకీ అస్పష్టత..?

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయనే విషయంలో ఎవరూ స్పష్టతకు రాలేకపోతున్నారు.ఎంపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మొదట్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికలో...

ఎంపీ ఎన్నికలు…హైదరాబాద్ లో కర్ఫ్యూ..!!

హైదరాబాద్ లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా కనిపించే మహానగరం వెలవెలబోతోంది. ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్ళకు వెళ్ళడంతో నగరమంతా బోసిపోయింది. ఇది హైదరాబాదేనా అనుమానం వచ్చేలా హైదరాబాద్ నిర్మానుష్యంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close