ముగింపు మురిపిస్తుందా?

2021లో స‌గం రోజుల్ని క‌రోనా తినేసింది. టాలీవుడ్ కి థియేట‌ర్ల స‌మ‌స్య వెంటాడింది. ఏపీలో టికెట్ రేట్ల గొడ‌వ ఒక‌టి. అందుకే పెద్ద సినిమాలు రావ‌డానికి భ‌య‌ప‌డ్డాయి. సెకండ్ వేవ్ త‌ర‌వాత‌.. థియేట‌ర్లు తెర‌చుకున్నా, చిన్న సినిమాలే దిక్క‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ అర కొర విజ‌యాలే ప‌డ్డాయి. కాక‌పోతే… మంచి సీజ‌న్ ముందుంది. ఈ రెండునెల‌ల్లో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. వాటిపై 2021 టాలీవుడ్ క్యాలెండ‌ర్ ఫ‌లితం ఆధార‌ప‌డి ఉండ‌బోతోంది.

నిజానికి న‌వంబ‌రు, డిసెంబ‌రు… నెల‌ల‌పై నిర్మాత‌ల‌కు చిన్న చూపు ఉంటుంది. ఎందుకంటే దీపావ‌ళి త‌ర‌వాత పండ‌గ‌లేం లేవు. పెద్ద సినిమాలు బ‌రిలో ఉండ‌వు. పైగా సంక్రాంతి ద‌గ్గ‌ర్లోనే ఉంటుంది క‌దా? పెద్ద సినిమా త‌యారైతే, సంక్రాంతికే తీసుకొద్దాం అనుకుంటారు. కానీ ఈసారి అలా జ‌ర‌గ‌డం లేదు. న‌వంబ‌రు, డిసెంబ‌రుపై గురి పెట్టారు నిర్మాత‌లు. దాంతో ఈ రెండు నెల‌ల్లో భారీ సంఖ్య‌లో సినిమాలు రాబోతున్నాయి. అందులో అఖండ‌, పుష్ష‌, శ్యాం సింగ‌రాయ్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి.

పుష్ష 1.. డిసెంబ‌రు 17న వ‌స్తోంది. అది పాన్ ఇండియా సినిమా. రంగ‌స్థ‌లం త‌ర‌వాత సుకుమార్, అలా వైకుంఠ‌పురంలో త‌ర‌వాత అల్లు అర్జున్ నుంచి వ‌స్తున్న సినిమా. ఇక అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌కృష్ణ – బోయ‌పాటి అఖండ పై కూడా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. బాల‌య్య‌ని ఎలా చూపించాలో, బోయ‌పాటికి తెలిసినంత ఎవ‌రికీ తెలియ‌ద‌న్న‌ది వాళ్ల న‌మ్మ‌కం. ఈసారి కూడా… హిట్టిస్తే, హ్యాట్రిక్ కొట్టిన‌ట్టే. నాని కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రం `శ్యాం సింగ‌రాయ్‌`. డిసెంబ‌రులో సినిమా ఉన్నా, ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్లు భారీగా చేసేస్తున్నారు. ర‌వితేజ ఖిలాడీ కూడా మంచి డేట్ కోసం ఎదురు చూస్తోంది. దృశ్య‌మ్ 2, విరాట‌ప‌ర్వం ఎప్పుడో రెడీ అయిపోయాయి. వాటికి కాస్త చోటు దొరికితే చాలు. వీటిమ‌ధ్య కనీసం 20 – 25 చిన్న సినిమాలు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేసుకున్నాయి. రాజా విక్ర‌మార్క‌, పుష్ప‌క‌విమానం, స్కై లాబ్‌, అర్జున‌, ఫాల్గుణ‌, ల‌క్ష్య‌, గుడ్ ల‌క్ స‌ఖి లాంటి సినిమాలు ఈ యేడాది చివ‌ర్లోగా ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. వీటిలో క‌నీసం నాలుగైదుహిట్లు ప‌డినా.. టాలీవుడ్ కొంత తేరుకుంటుంది. 2022 కి ఘ‌నంగా స్వాగ‌తం ప‌క‌ల‌డానికి, కొత్త ఆశ‌లు నింపుకోవ‌డానికి ఊపిరి వ‌చ్చిన‌ట్టు అవుతుంది. మ‌రి.. 2021 ముగింపు ఎలా ఉండ‌బోతోందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close