కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అత్యంత నమ్మకస్తులకు మాత్రమే గవర్నర్ పదవులు ఇస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బీజేపీ లైన్ దాటని వారికే పదవులు ఇస్తారు. అయితే వారి చాయిస్ కూడా ఓ గవర్నర్ విషయంలో తప్పయిపోయింది. ఆయన ఇప్పుడు ఇష్టమొచ్చిట్లుగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఆయనను ఎలా కంట్రోల్ చేయలో తెలియక బీజేపీ హైకమాండ్ కూడా తికమకపడుతోంది. ఆయనను గవర్నర్ పదవి నుంచి తీసేద్దామా అంటే ఎన్నికల కాలం అని పంటి బిగువున బాధ బరిస్తోంది.
ఆ గవర్నర్ ఎవరో కాదు.. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. కేంద్రం జంతువులు చనిపోతే సంతాపం ప్రకటిస్తుంది కానీ.. రైతులు చనిపోతే పట్టించుకోరా అని ఆయన మళ్లీ గొంతెత్తారు. ఆయన మాట్లాడేది రైతుల ఉద్యమం గురించే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఇటీవల తన గొంతు సవరించుకుటున్నారు. కేంద్రంపై వరుస విమర్శలు చేస్తున్నారు. అంతేనా.. అవినీతి ఆరోపణలు కూడా చేస్తున్నారు. బీజేపీ నేత కాబట్టి.. ఆ పార్టీ నామినేట్ చేసిన గవర్నర్ కాబట్టి సహజంగానే సొంత పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
యూపీకి చెందిన సత్యపాల్ మాలిక్ రెండు సార్లు ఎంపీ, ఆయనకు సామాజికవర్గం అండ ఉంది. ఆయన గతంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండేవారు. తర్వాత ఆయనను తప్పించారు. ఆ కారణమో.. మరొకటో కానీ.. ఆయనకు ఇప్పుడు బీజేపీ హైకమాండ్‌పై ఆగ్రహం వచ్చినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ లైన్ దాటి విమర్శలు చేస్తున్నారు. మోడీ, అమిత్ షాకు చిర్రెత్తితే రాత్రికి రాత్రి ఆయనను రీకాల్ చేసే అవకాశం ఉంది. అయినా కానీ ఎందుకో ఆలోచిస్తున్నారు మోడీ, షా.