అండగా ఉంటానని సోనుసూద్‌కు కేటీఆర్ భరోసా !

సోనుసూద్ రాజకీయాల్లోకి వస్తారని భయపడే ఆయనపై ఐటీ దాడులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఈ విషయంలో ఆయనకు తాము అండగా ఉంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. సోనుసూద్, కేటీఆర్ హైదరాబాద్‌లో జరిగిన కోవిడ్ వారియర్స్ కు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురి ప్రసంగాల్లో ఒకరినొకరు విపరీతంగా పొగుడుకున్నారు. ఈ సందర్బంలో ఐటీ దాడులు రాజకీయ కక్ష సాధింపులన్న పద్దతిలో కేటీఆర్ మాట్లాడారు.

ఒక్క ఐటీ దాడులే కాకుండా సోనుసూద్‌ను విపరీతంగా పొగడటానికి కేటీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. కోవిడ్ కష్టకాలంలో ఎటువంటి స్వార్థం లేకుండా మనవత్వంతో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారని సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు ఒక్క ప్రభుత్వమే అన్ని చేయలేదని, సోనూసూద్‌ వంటివారి చేయూత ఎంతైనా అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సోనుసూద్ కూడా కేటీఆర్‌ను ప్రశంసించారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు తాను సహాయ కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఒక్క తెలంగాణ నుంచే సమాంతరంగా ప్రతిస్పందించే వ్యవస్థ తనకు కనిపించిందన్నారు. ఆ వ్యవస్థ కేటీఆర్ ఆఫీస్ అని సోనుసూద్ గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ లాంటి వాళ్లు ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఉండబోదన్నారు.

సోనుసూద్, కేటీఆర్ మధ్య ఈ ర్యాపో ఇప్పటిది కాదు. చాలా రోజుల నుంచి ఉంది. గతంలో ట్వీట్లలోనూ ఒకరినొకరు పొగుడు.మీరు రియల్ హీరో అంటే మీరు రియల్ హీరో అని ప్రశంసలు కురిపించుకున్నారు. ఇప్పుడా అవకాశం నేరుగా వచ్ిచంది . అదే చెప్పుకున్నారు. అయితే సోనుసూద్‌పై ఐటీ దాడుల అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించి వేధింపులుగా చెప్పడం.. తాము అండగా ఉంటామని హామీ ఇవ్వడమే కాస్త భిన్నంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close