ఇప్ప‌టి వ‌ర‌కూ చూడ‌ని త‌మ‌న్నాని చూస్తారు

చిరంజీవితో మ‌రోసారి క‌ల‌సి న‌టించే అవ‌కాశం అందుకుంది.. త‌మ‌న్నా. `సైరా` త‌రవాత `భోళా శంక‌ర్‌` కోసం చిరుతో జ‌త క‌ట్ట‌బోతోంది. ఈరోజే.. భోళా శంక‌ర్ క్లాప్ కొట్టుకుంది. ఈ సంద‌ర్భంగా.. త‌మ‌న్నా మీడియాతో త‌న మ‌న‌సులోని భావాల్ని పంచుకుంది.

”కోవిడ్ లాక్ డౌన్ లాంటి క‌ష్ట‌మైన స‌మ‌యం త‌ర‌వాత మెల్ల‌మెల్ల‌గా జ‌నాలు బ‌య‌ట‌కి వ‌స్తున్నారు. భోళా శంక‌ర్ తో మ‌రింత హోప్ వ‌చ్చింది. ఇలాంటి సినిమాల్ని థియేట‌ర్లో ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఈ యేడాది వ‌రుస‌గా ప్రాజెక్టులు చేస్తున్నా. బాగా అల‌సిపోయా. కొంత బ్రేక్‌తీసుకుని వెకేష‌న్ కి వెళ్దామ‌నుకున్నా. నా కెరీర్ ప్రారంభంలోనే… మెహ‌ర్ గారితో ప‌నిచేయాలి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న‌తో సినిమా చేయ‌క‌లేక‌పోయా. `ఈ పాత్ర మీరే చేయాలి.. మీరు చేస్తేనే ఈ పాత్ర‌కు న్యాయం జ‌రుగుతుంది` అని చెప్పి ఒప్పించాడు. అలాంటి న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు… ఎంత అల‌సిపోయినా ప‌నిచేయాల‌నిపిస్తుంది. చిరంజీవిగారితో క‌ల‌సి మ‌రోసారి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ నేను నా బెస్ట్ చూడ‌లేదు. లుక్స్‌ప‌రంగా, న‌ట‌న ప‌రంగా.. ఓ కొత్త త‌మ‌న్నాని చూస్తారు. భోళా శంక‌ర్ లో స్పెష‌ల్ థింగ్స్ ఉన్నాయి. ఇన్నేళ్ల త‌ర‌వాత ఓ సినిమాని రీమేక్ చేస్తున్నామంటే… అందులో క‌చ్చితంగా చాలా ప్ర‌త్యేక‌త ఉండాలి. త‌ప్ప‌కుండా అవ‌న్నీ భోళా శంక‌ర్ తో చూస్తారు” అని చెప్పుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close