తెలకపల్లి రవి : సందేహాలతో బాబు సాకుల వేటా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే విజయవాడ ప్రాంతంలో అద్దెల గురించి, భూముల రేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి ప్రజలకు రుచించడం లేదు. రాజధాని వస్తే అభివృద్ధి వస్తుందని వూరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అద్దెలు కొంచెం పెరగ్గానే ఏదో అయిపోయినట్టు తానే ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడుగుతున్నారు. భూముల లావాదేవీలు స్తంభించిపోయి అనేకమంది సంక్షోభంలో కూరుకుపోయారు. కాని సిఎం మాత్రం భూముల రేట్ల పెంపు అంటున్నారు. ఒకోసారి ఎందుకు రాజధాని అనిపిస్తుంది అని ఒక శాసనసభ్యుడన్నారు. పెట్టుబడులు ప్రవాహంలా వస్తాయని చెప్పిన ప్రభుత్వమే దీనివల్ల పెట్టుబడులు ఆగిపోతాయని హెచ్చరించడం న్యాయమేనా అని ఒక స్థానిక వ్యాపారి ప్రశ్నించారు. నిజంగా ఏమీ జరగడం లేదు గనక నెపం మా మీద పెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారా అని కూడా సందేహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబుకే సందేహాలు పెరిగిపోయి సాకులు వెతుకుతున్నారని మరో పరిశీలకుడు వ్యాఖ్యానించారు.

మాటలు జాగ్రత్తగా వాడకుండా పొరబాటు సంకేతాలు పంపడం రివాజుగా మారిన ముఖ్యమంత్రి ఈ రోజు ఎల్‌వి ప్రసాద్‌ ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో అనవసరంగా ప్రాంతాల తేడా గురించి చెప్పారు. ఇక్కడ అద్దెలు పెరిగిపోతే పెట్టుబడులు రాయలసీమకు పోతాయని అక్కడికి పోతే వేరే రాష్ట్రాలకు పోతాయని హెచ్చరించారు. నిజంగా రాయలసీమకు పోతే విచారించాల్సిన పని ఏముంటుంది? ఇప్పటికే ఆ ప్రాంతంలో కొన్ని అనుమానాలు, ఆందోళనలు సాగుతుంటే స్వయానా చంద్రబాబు ఇలా మాట్లాడ్డం ఉచితమేనా అని రాయలసీమకు చెందిన ఒక సీనియర్‌ నాయకుడు అన్నారు. ఆయన మనసులో మాట ఇలా బయిటకు వచ్చిందని కూడా వ్యాఖ్యానించారు. ఏమైనా ఆతృతలో హడావుడిలో పొరబాటు సంకేతాలు పంపుతుంటే కష్టమవుతుందని అవసరాన్ని మించి మాట్లాడ్డం, ముందుగా హౌం వర్క్‌ చేయకపోవడం వల్లనే ఇలాటి తప్పిదాలు జరుగుతున్నాయని పాలక పార్టీ నాయకులు కూడా అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

బీఆర్ఎస్ కూ ఓ వ్యూహకర్త అవసరమే..!!

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకొని తర్వాత వదిలేసుకున్న బీఆర్ఎస్ కు ఆ అవసరం ఏపాటిదో క్రమంగా అర్థం అవుతోంది. వ్యుహకర్తగా అపాయింట్ చేసుకున్న సునీల్ కనుగోలు వ్యూహాలతో కాంగ్రెస్...

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close