మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరణ ! జగన్ మరో స్కెచ్ ?

ఓ వైపు వరదలతో లక్షలాది మంది అల్లాడుతూంటే ఏపీ ప్రభుత్వం… మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుఅంశాల్లో ఏం చేయాలో తల బాదుకుంటోంది. హైకోర్టు ఆ బిల్లులను కొట్టి వేస్తుందని న్యాయనిపుణులు తేల్చేయడంతో ఇప్పుడు ఆ నిర్ణయాలను ఎలాగైనా లైవ్‌లో ఉంచాలన్న వ్యూహంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం అయిన తర్వాత ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఆ తర్వాత మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. మంత్రులు ఆమోదించారు.

ఈ విషయాన్ని హైకోర్టులో మూడు రాధానులపై విచారణ జరుగుతున్న సందర్భంలో ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ వివరించారు. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది.

మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వం మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్లుగా కాదని.. మరో రూపంలో తెర మందుకు తెస్తారని భావిస్తున్నారు. కోర్టుల్లో ఆ బిల్లులు నిలబడవన్న కారణంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఏ రూపంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో సీఎం జగన్ చేయనున్న ప్రకటన ఆధారంగా ప్రభుత్వ వ్యూహం ఏమిటో తెలిసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

జనసేన స్ట్రైక్ రేట్ ఎనభై శాతం ఉంటుందా?

జనసేన పార్టీ గత ఎన్నికల్లో చదవి చూసిన ఘోర పరాజయాన్ని మరిపించేలా ఈ సారి ఎన్నికల పలితాలు ఉంటాయని పోలింగ్ సరళి తర్వాత నిపుణులు ఓ అంచనాకు వస్తున్నారు. మొత్తం ఇరవై...

భారత్ కు అమెరికా వార్నింగ్ ..!!

ఇరాన్ తో చాబహార్ పోర్టుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవడంపై ఇండియాకు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ తో ఏ సంస్థ అయినా, దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే ఆంక్షలు విధిస్తామని...

తెరపైకి క్రికెటర్ క్యారెక్టరైజేషన్

ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ గుర్తున్నాడా? మెరుపు వేగంతో బంతులు వేసే బాలాజీ ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. ఆయన సీరియస్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపుగా ఆయన స్మైల్ ఫేస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close