వచ్చే నెల వాటా కూడా ఇచ్చేశారు.. కేంద్రానికి ఎంత ప్రేమో!?

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర పన్నుల వాటా సొమ్ము దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లు ఖాతాలో పడ్డాయి. దీంతో నెలాఖరు వస్తోంది.. ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకునే పరిస్థితి లేదు ఎలా అని కంగారు పడుతున్న సమయంలో కేంద్రం పాలకులకు ఏ మాత్రం టెన్షన్ లేకుండా డబ్బులను ఖాతాలో జమ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం ఎందుకు ఇచ్చింది అంటే… పన్నుల వాటా. ప్రతి నెలా రాష్ట్రానికి పన్నుల వాటా కింద రూ. పద్దెనిమిది వందల కోట్ల వరకూ వస్తాయి. కానీ ఈ సారి అవి రాష్ట్ర ప్రభుత్వానికి సరిపోవు. ఏదో ఓ పరిష్కార మార్గం చూపించాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో పదే పదే మంత్రాంగం జరిపిన ఫలితంగా వచ్చే నెల పన్నుల వాటా కూడా ఈ నెలే ఇచ్చేలా అంగీకరింపచేశారు.

ఒక్క ఏపీకే అలా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలకు వర్తింప చేశారు. అందరికీ వచ్చే నెల పన్నుల వాటా కూడా ఈ నెలే ఇచ్చేశారు. ప్రతి నెలా అన్ని రాష్ట్రాలకు రూ. నలభై ఐదు వేల కోట్ల వరకూ పన్నుల వాటా ఇస్తారు.. ఈ సారి మాత్రం రూ. 90వేల కోట్లు ఇచ్చారు. కొత్త అప్పులు వెదుక్కునే ప్రయత్నంలో కీలక దశలో ఉన్న ఏపీ సర్కార్‌కు కేంద్రం చేసిన సాయం ఎంతో రిలీఫ్ ఇస్తుంది. సామాజిక పెన్షన్లు, జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు ఇబ్బందులు లేకుండా చూస్తోంది. అయితే వచ్చే నెల పన్నుల ఆదాయం కూడా ఇప్పుడే తీసుకుంటే మరి వచ్చే నెల పరిస్థితేమిటి ? అప్పటికి కేంద్రం ఏదో ఓ పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నారు.

ఆర్బీఐ నుంచి అదనపు రుణం కోసం నిర్మలా సీతారామన్ అనుమతి ఇప్పిస్తారని.. లేకపోతే మరో ఆర్థిక సంస్థ నుంచి అయినా ఇప్పిస్తారని.. తమను ఇలా వదిలేయరని ఏపీ ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. కేంద్రం బాధ్యత తీసుకున్నంత వరకూ ఏపీ సర్కార్ ఎన్ని వేల కోట్లకు లెక్కలు చెప్పకపోయినా నిధులు అలా వచ్చిపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎవరికీ ఫికర్ లేదు. కాకపోతే బుగ్గనకు మాత్రమే కాస్త ఢిల్లీలో పని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోస్టల్ బ్యాలెట్స్‌పై వైసీపీకి షాకిచ్చిన ఈసీ

పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువగా చెల్లకుండా చేయాలన్న వైసీపీ ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఫామ్ 13ఏ'పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. అలా ఉండి స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు...

వైసీపీకి షాక్… పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌పై సీఈసీ స్ప‌ష్ట‌త‌

ఏపీలో రెండు మూడు రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అయిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. పోస్ట‌ల్ బ్యాలెట్ల విష‌యంలో చాలా చోట్ల రిట‌ర్నింగ్ అధికారులు సంత‌కం చేసినా, సీల్ వేయ‌లేదు. కొన్ని...

సుధీర్ బాబు బిరుదు మారింది

మ‌న హీరోలంద‌రికీ పేరుకు ముందు ఏదో ఓ బిరుదు త‌గిలించుకోవ‌డం అల‌వాటు. ఒక‌వేళ వాళ్ల‌కు ఇష్టం లేక‌పోయినా, ఫ్యాన్సూ, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ త‌గిలించేస్తుంటారు. సుధీర్ బాబుకీ ఓ బిరుదు ఉంది. నైట్రో స్టార్...
video

‘హరోం హర’ ట్రైలర్: కుప్పంలో ఆయుధ పూజ

https://youtu.be/fnef0Uvvx1I?si=7BScZ4oy9zD2DSxc సుధీర్ బాబు 'హరోం హర' సినిమాతో రాబోతున్నాడు. సేహరి సినిమా తీసిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు వచ్చాయి కానీ కథ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close