వరుసెంట సినిమాలు చేస్తున్నాడు.. దిల్ రాజు వ్యూహ రచన ఏంటో..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య స్పీడ్ పెంచాడనే అనాలి. ఒకప్పుడు సేఫ్ జోన్ చూసుకుని సినిమాలను నిర్మించే దిల్ రాజు ఇప్పుడు వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ సినిమా మొదలు అభిరుచి గల సినిమాలను నిర్మిస్తూ యూత్ లో తన బ్యానర్ అంటే ఒక క్రేజ్ ఏర్పడేలా చేసుకున్నాడు. రాజు సినిమాలో హీరో, హీరోయిన్ దర్శకుల కన్నా దిల్ రాజు అనే టైటిల్ కార్డ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఇక 2011 దాకా జోరు మీదున్న దిల్ రాజు ఆ తర్వాత 2012లో ఒక్క సినిమా కూడా నిర్మించలేదు ఇక 2013-14ల్లో కూడా కేవలం ఒకటి రెండు సినిమాలనే నిర్మిస్తూ వచ్చాడు. అయితే 2015 నుండి మళ్లీ దిల్ రాజు తన సినిమాలను వరుసగా నిర్మించడం మొదలు పెట్టాడు. 2015 లో కేరింత, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలను నిర్మించిన రాజు ఈ సంవత్సరం ఇప్పటికే ఓ సినిమా రిలీజ్ చేయగా సెట్స్ మీద రెండు సినిమాలు ఉండగా.. మరో రెండు సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నాడు. అందులో మెగా హీరోల సినిమాలు రెండు కాగా మరోటి యువ సంచలనం రాజ్ తరుణ్ తో ఒకటి.

అయితే చిన్న సినిమాల్లో ఎక్కువ లాభం పొందుతున్న మితగా నిర్మాతల్లా తెలివి మీరి దిల్ రాజు కూడా నిర్మాతగా బిజీ అయ్యాడా అంటే తన బ్యానర్ కున్న వాల్యూ తో స్టార్ హీరోలతోనే సినిమా చేయగల రాజు కేవలం చిన్న హీరోలతో సరిపెట్టుకోవడంలో ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. మరి వరుస సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు వ్యూహ రచన ఏంటో ఆయనకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close